Begin typing your search above and press return to search.
స్టార్ హోటల్లో బీజేపీ అధ్యక్షురాలి ఫోన్ కొట్టేశారు!
By: Tupaki Desk | 16 Jun 2019 5:13 AM GMTస్టార్ హోటల్లో జరుగుతున్న కార్యక్రమం. అందునా కేంద్రమంత్రి నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రోగ్రాం. అలాంటి చోట భద్రత ఎంత భారీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి చోట ఒక ప్రముఖ పార్టీ అధ్యక్షరాలి ఫోన్ పోయిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఈ ఆసక్తికర ఉదంతం ఎక్కడ చోటు చేసుకుందంటే..
కేంద్ర ఆహార భద్రత శాఖామంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెన్నైకి వచ్చారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఒక స్టార్ హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళసైతో పాటు పలువరు బీజేపీ నేతలు హాజరయ్యారు.
మీడియా సమావేశం జరుగుతున్న వేళ.. తన ఫోన్ చోరీకి గురైందన్న విషయాన్ని ఆమె గుర్తించారు. షాక్ తిన్న ఆమె.. హాల్ మొత్తం వెతికించారు. అయినా ఫలితం లేకపోయింది. కేంద్రమంత్రి ఉన్న సమావేశ మందిరంలో.. తన ఫోన్ చోరీకి గురి కావటం ఆమెతో పాటు అక్కడున్న వారంతా విస్మయానికి గురి అవుతున్నారు. తన ఫోన్ చోరీకి సంబంధించిన ఫిర్యాదును పట్టినపాక్కం పోలీస్ స్టేషన్లో చేశారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు బిజీగా ఉన్నారు.