Begin typing your search above and press return to search.
లండన్ లో మిస్సైన బీజేపీ నేత కొడుకు
By: Tupaki Desk | 24 Aug 2019 4:56 AM GMTదేశం కాని దేశం.. మన భాష కాదు.. మన మనుషులు కాదు.. అక్కడికి చదువుకోవడానికి వెళ్లిన మన విద్యార్థులు ఎంత వరకు సేఫ్ అనేది చెప్పడం కష్టం. ఏదైనా జరిగితే కన్నుకోవడం..వారిని కాపాడుకోవడం.. కనిపెట్టడం కష్టం. ఇప్పుడు అలాంటి మరో ఉపద్రవం చోటుచేసుకుంది.
విదేశాల్లో భారతీయులకు సంబంధించిన వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న వేళ లండన్ లో తెలుగు విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతోంది. లండన్ లో పీజీ చదువుతున్న ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ కొడుకు హర్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి అక్కడ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.
లండన్ లో చదువుకుంటున్న విద్యార్థి హర్ష కనిపించకుండా పోవడంతో తోటి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి వెతుకుతున్నారు.
కాగా హర్ష మిస్సింగ్ విషయాన్ని ఖమ్మం జీవీ మాల్ అధినేత గుర్రం ఉమా మహేశ్వరరావు.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెప్పారు. ఆయన వెంటనే ఫోన్ చేసి హర్షం బంధువులతో మాట్లాడారు. హర్షకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వెంటనే విదేశాంగ శాఖతోపాటు లండన్ లో ఉన్న తెలుగు వాళ్లు, అక్కడి రాయబార కార్యాలయంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా కేంద్రానికి లేఖ రాసి హర్ష ఆచూకీ తెలుసుకోవడానికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.