Begin typing your search above and press return to search.

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వర్మ అనుచిత ట్వీట్.. వివాదం

By:  Tupaki Desk   |   24 Jun 2022 10:00 AM GMT
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వర్మ అనుచిత ట్వీట్.. వివాదం
X
ఆయనో సంచలన డైరెక్టర్.. నిత్యం ఏదో ఒక వివాదం లేనిదో పొద్దు గడవదు. యధార్థ ఘటనలను సినిమాలుగా చూపించే డిఫరెంట్ రైటర్.. ఆయన మాట్లాడినా వివాదమే.. సైలెన్స్ గా ఉన్న సంచలనమే.. ట్వీట్ చేస్తే వార్..కామెంట్ చేస్తే రచ్చ రచ్చ.. తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో ప్రత్యేకం. తెలుగు నుంచి హీందీ వరకు రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించిన వాళ్లు ఎక్కువే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు సైతం ఆర్జీవి సినిమాకు వద్దనకుండా నటించేస్తారు.

ఇక ఆర్జీవీ సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సంఘటనలపై స్పందిస్తారు. ముఖ్యంగా సమకాలీన రాజకీయాలు అంటే ఈ డైరెక్టర్ కు బాగా ఇష్టం. పోలిటికల్ రంగంపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తారు. తాజాగా దేశంలో హాట్ టాపిక్ గా మారిన 'రాష్ట్రపతి ఎన్నికల’పై వర్మ స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

రాంగోపాల్ వర్మ ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిని ఉద్దేశించి పలు అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ద్రౌపది ముర్మును ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్ పై బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ద్రౌపది ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్మ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని అబిడ్స్ పోలీసులను కోరారు. మహిళపట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

రాంగోపాల్ వర్మ ట్వీట్ విషయానికి వస్తే.. 'ద్రౌపది రాష్ట్రపతి.. మరి పాండవులు ఎవరు? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు?’ అంటూ కాబోయే రాష్ట్రపతిపై వర్మ నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవల హిజాబ్ వివాదంలోనూ వర్మ ఇలాగే నోరుపారేసుకున్నారు. హిజాబ్ వివాదంలో పెద్ద సమస్య ఏమిటంటే దుస్తులను ఆయుధాలుగా మార్చడం.. రెండు మతాల మధ్య ఘర్షణాత్మక అంశాలపై ఇప్పటికే ఉన్న సుదీర్ఘ వివాదాలకు దాన్ని జోడించడం’ అని వర్మ హిజాబ్ వివాదంపై తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. 'హిజాబ్ వంటి నిర్దిష్ట దుస్తులను ధరించడం వివక్షగా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో ప్రత్యేకంగా నిలబడటం అనేది పరధ్యానంగా మారవచ్చు, విశ్వాసం ప్రైవేట్‌గా ఆచరించాలి.. ప్రచారం చేయకూడదా అనే ప్రశ్న ముందుకు వస్తుంది.’అని వర్మ తనదైన శైలిలో హితబోధ చేశాడు.

ఇలా వరుస వివాదాలతో వర్మ కాకరేపుతున్నాడు. రాజకీయాలపై ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.