Begin typing your search above and press return to search.
కుంభస్థలాన్ని కన్నేసిన రఘునందన్
By: Tupaki Desk | 21 Jun 2022 11:30 PM GMTకాన్ఫిడెన్సుతో ఉన్నారో లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారో కానీ ఒక్కమాట మాత్రం నిజం బీజేపీతో పోరుకు అటు ఈటల కానీ ఇటు రఘనందన్ కానీ శక్తికి మించి సిద్ధం అవుతున్నారు. ఆ క్రమంలో పార్టీలో అందరి సహకారం కోరుతున్నారు కూడా ! ఢిల్లీ పెద్దలు కూడా ఈ సారి ఆశించిన ఫలితాలు అందుకుంటే రఘునందన్ కు పార్టీలో మరింత మంచి స్థానం ఇచ్చేందుకే చూస్తున్నారు. ఇప్పటికే సీనియర్ అయిన ఈటలకు ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలు అప్పగించే వీలుందని తెలుస్తోంది. కాంగ్రెస్ అసంతృప్త వాదులను ఇటుగా తీసుకువచ్చే బాధ్యతను ఆయన నెత్తి మీద పె ట్టారని ఢిల్లీ కేంద్రం గా వినిపిస్తున్న టాక్.
ఇప్పుడు స్థానికంగా మరికొంత బలం పుంజుకున్న బీజేపీకి బండి లాంటి నాయకుల కన్నా రఘునందన్ లాంటి ఫైర్ ఉన్న లీడర్లే అవసరం అన్నది ఓ అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినవస్తోంది. గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన కేసీఆర్ ను ఓడిస్తానని చెప్పడం ప్రస్తుతానికి కాస్త అతిగానే అనిపించినా ఏమో రేపటి వేళ ఏమయినా జరగవచ్చు !
లాయర్ రఘునందన్ రావు తాను విడిచి వచ్చిన గులాబీ దండుపై దండెత్తేందుకు సిద్ధం అవ్వడం ఆశ్చర్యకరం. జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి సంచలన వివరాలు వెల్లడించి అందరినీ ఆలోచింపజేసిన రఘునందన్ ఇకపై తన మామపై పోరుకు సిద్ధం అవుతానని అంటున్నారు.
ఇంతకూ మామ ఆ మాట విన్నారా .. ఆయనేమో తెలంగాణలో ఐదు విప్లవాలు తీసుకువచ్చామ ని తద్వారా పశు, మత్స్య సంపద పెంపుదలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంపు దల చేశామని ఇవాళ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈయనేమో అవన్నీ అబద్ధాలే నేను ఇక్కడ అంటే గజ్వేల్ నుంచి పోటీ చేసి కేసీఆర్ ను ఓడిస్తానని అంటున్నారు. ఈ వైరం లేదా వాగ్యుద్ధం ఎందాక ?
దుబ్బాకలో గెలిచాక మాజీ జర్నలిస్టు మరియు మాజీ నక్సలైటు అయిన రఘునందన్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే ఈ సారి ఆయన తెలంగాణ పెద్ద కేసీఆర్ ను ఓడించేందుకు సిద్ధం అని పెద్ద పెద్ద మాటలేవో చెబుతున్నారు అని అంటున్నారు కొందరు. ఆవిధంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం ఆదేశాలు ఇస్తే తప్పక బరిలో నిలిచి గెలుస్తానని కూడా రఘునందన్ అంటున్నారు. ఎక్కడిదీ కాన్ఫిడెన్స్ ? ఎందుకీ కాన్ఫిడెన్స్ ? ఎలా చూసుకున్నా వచ్చే ఎన్నికలు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు జీవన్మరణమే.
కొన్ని చోట్ల లోపాయికారి ఒప్పందాలన్నవి కొందరి మధ్య కూడా ఉంటే ఉండవచ్చు అని కూడా పరిశీలకులు అంటున్నారు. అందుకే రఘునందన్ అంత ధీమాగా ఈ స్టేట్మెంట్ ఇచ్చి, టీఆర్ఎస్-లో ఓ కుదుపు వచ్చే విధంగా చేసి ఉంటారని అభిప్రాయం ఒకటి వెల్లడి అవుతోంది.