Begin typing your search above and press return to search.
హోదా కుదరదు..బాబు ఇప్పటికీ మా మిత్రుడే
By: Tupaki Desk | 20 July 2018 1:43 PM GMTఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మరోమారు కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్ మాట్లాడడం మానుకోవాలన్నారు. కావాలంటే అధిక నిధులను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. లోక్‌సభలో ఇవాళ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో హోంమంత్రి మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి కోసం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం విడుదల చేసిన నిధుల వివరాలను మంత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుతో తమకు గల దోస్తీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తున్నదని, అయితే హోదా ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ కింద రాష్ర్టానికి 32 శాతం నిధులను విడుదల చేస్తామని, కానీ మేం అంతకన్నా ఎక్కువే విడుదల చేశామని, ఏపీ కోసం ప్రత్యేక ప్యాకేజీని కూడా రిలీజ్ చేసినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను వదిలేసి, రాష్ర్టాభివృద్ధిపై టీడీపీ దృష్టిపెట్టాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. ఏపీ ఈ దేశంలో భాగమే అని, విభజన వల్ల ఆ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసని, ఏపీకి మద్దతు ఇస్తామని రాజ్‌నాథ్ చెప్పారు. తెలంగాణతో పాటు ఏపీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ వైదొలిగినప్పటికీ.. చంద్రబాబు మాకు మిత్రుడేనని సంచలన కామెంట్ చేశారు. ఇప్పటికీ చంద్రబాబుతో మాకు మితృత్వం ఉందని, భవిష్యత్తులో కూడా తమ స్నేహం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాగా, పెద్ద నోట్ల రద్దు తర్వాత యూపీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. కేరళ, త్రిపుర రాష్ర్టాల్లో బీజేపీ తన ఉనికిని చాటుకుందన్నారు. శశిథరూర్ చేసిన హిందూ తాలిబన్ వ్యాఖ్యలను రాజ్‌నాథ్ తప్పుపట్టారు. గతంలో భద్రతా దళాలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయేవారు అని, కానీ ఇప్పుడు నక్సల్స్ చనిపోతున్నారని అన్నారు. మూకోన్మాద ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని, కానీ ఆ ఘటనలను అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భారత్ ఆర్థికంగా దూసుకెళ్లుతున్నదని ఆయన అన్నారు. ఈ వాస్తవాన్ని ఆర్థిక నిపుణులు, గ్లోబల్ ఏజెన్సీలు అంగీకరిస్తున్నాయన్నారు. జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతం చేరుకుంటుందని యూఎన్‌తో పాటు ఐఎంఎఫ్ కూడా గుర్తించాయని ఆయన తెలిపారు. 2030 వరకు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మూడవ దేశంగా నిలుస్తుందన్నారు. నోయిడాలో అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీని ప్రారంభించామన్నారు.