Begin typing your search above and press return to search.
విదేశీయులతో బీజేపీ ర్యాలీ.. గుజరాత్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు
By: Tupaki Desk | 25 Nov 2022 2:30 AM GMTఇటీవల ప్రధాని మోడీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఒక బాలికతో బీజేపీ పాట పాడించడం దుమారం రేపింది. చిన్న పిల్లలతో ఈ ప్రచారం ఏంటని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. పిల్లలను కూడా ప్రచారానికి వాడుకుంటారా? అని ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ ఈసీ సంగతి తెలుసు కదా.. అధికారంలోకి ఉన్న వారికి అనుకువగా.. ప్రతిపక్షంలో ఉన్న వారికి ఘాటుగా ఉంటుంది. అందుకే చర్యలు ఏం తీసుకోలేదు.
ఆ ఉదంతం మరిచిపోకముందే గుజరాత్ లో బీజేపీ మరో దుమారం రేపింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ఇందులో విదేశీయులు పాల్గొనడం పెను దుమారం రేపింది. బీజేపీకి ఓటు వేయండని విదేశీయుల చేత చెప్పించడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో భాగం కావడానికి విదేశీలయును అనుమతించినప్పుడు బీజేపీ ర్యాలీలో పాల్గొనడానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. గతంలో సాగు చట్టాలపై రైతుల నిరసనలకు విదేశీయులు సపోర్ట్ చేయడాన్ని కేంద్రం తప్పు పట్టింది.
ఇప్పుడు గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీ దండు అంతా అక్కడే మోహరించింది. ప్రధాని మోడీ సైతం ఫుల్ ఫోకస్ పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా వాడేస్తున్నారు. బీజేపీ ర్యాలీలో విదేశీయులను సైతం పాల్గొనేలా చేసి ఇప్పుడు పెనుదుమారం రేపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.