Begin typing your search above and press return to search.

టైం కథనంతో బీజేపీకి ఊపొచ్చింది

By:  Tupaki Desk   |   11 May 2019 4:55 PM GMT
టైం కథనంతో బీజేపీకి ఊపొచ్చింది
X
ఊహించిందే జరిగింది. ఆపద్ధర్మ ప్రధాని నరేంద్ర మోడీ పై టైమ్ మ్యాగజైన్ కథనం సంచలన అయ్యింది. అయితే, రచయిత తండ్రి పాకిస్తానీ జాతీయుడు కావడంతో కథ కొత్త మలుపు తీసుకుంది. టైం తీరు పట్ల బీజేపీ విరుచుకుపడింది. దీని వెనుక ప్రత్యేక అజెండా ఉందని దూషించింది.

టైమ్ మ్యాగజైన్ మోడీని డివైడర్ ఇన్ చీఫ్ అని పేర్కొనడం .... పాకిస్తాన్ ఎజెండా అంటూ బీజేపీ వ్యాఖ్యానించింది. కథనం రాసిన జర్నలిస్టు తసీర్ పాకిస్థాన్ ఎజెండా తీసుకున్నాడని ఆ పార్టీ విమర్శించింది. పాకిస్తాన్ ఎజెండాతో రాసిన ఈ కథనాన్ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేసిన రీ ట్వీట్ చేయడం అతిపెద్ద తప్పుగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పేర్కొన్నారు. 2014లో కూడా ఇలాగే కుట్రలు పన్ని దాడి చేశారు - మోడీ గెలవరు అన్నారు. కానీ తర్వాత ఏం జరిగిందో ప్రపంచం చూసింది. ఇపుడు కూడా అంతే అంటూ పాత్రా వ్యాఖ్యానించారు.

వాస్తవానికి టైం ఇచ్చిన సరుకు సరయిన సమయానికి బీజేపీకి ఉపయోగడపడింది. వాస్తవాన్ని హిందువులకు ఎంతో కోపం తెప్పిస్తే బీజేపీకి అంత మంచిదనే కోణంలో బీజేపీ నేతలు ఊహిస్తున్న నేపథ్యంలో ఈ కథనంపై వారు విరుచుకుపడినా వారి ప్రయోజనం అయితే నెరవేరుతున్నట్లే అర్థమవుతోంది.

ఇక టైం మ్యాగజైన్ తో పాటు జర్నలిస్ట్ ఆతిష్‌ తసీర్‌ పై కూడా దాడి మొదలైంది. అతడి సమాచారాన్ని వికీపీడియాలో మార్చేశారు. ఆయన రచయిత - కాంగ్రెస్ పార్టీ పీఆర్వీ అని ఎడిట్ చేశారు. టైం కవర్ స్టోరీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లోనే వికీపీడియా పేజీని మార్చేయడం గమనార్హం.

కథనం రాయడమే కాకుండా దానిని షేర్ చేస్తూ ఆశిష్ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామిక దేశమైన భారత్‌ ప్రపంచ దిగ్గజంగా ఎదగాలంటే మోడీ లాంటి నేత అవసరమని గతంలో టైమ్‌ మేగజీన్‌ కవర్‌ పేజీతో ఆయన ఇంటర్వ్యూను ప్రచురించింది. ఇప్పుడు ఆ ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయని - భారత ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తానంటూ అధికారంలోకి వచ్చిన మోదీ అన్నింటా విఫలమయ్యారని - ఆయన చర్యలు జాతీయ వాదానికి బీజం వేశాయంటూ’’ పేర్కొన్న ట్వీట్ వేశారు. దీంతో బీజేపీ నేతలు మరింత ఆగ్రహానికి గురయ్యారు.