Begin typing your search above and press return to search.
కేసీఆర్ అప్పటి కోరికను ఇప్పుడు నెరవేరుస్తున్న బీజేపీ!
By: Tupaki Desk | 22 Aug 2019 7:00 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దీర్ఘకాలిక కోరికను నెరవేర్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రయత్నిస్తోందని సమాచారం. కేసీఆర్ నాలుగేళ్ల డిమాండ్ ను పరిష్కరించేందుకు కమలనాథులు కదలడం వెనుక గులాబీ దళపతి ఆకాంక్షలను నెరవేర్చడం కంటే...తమ సొంత రాజకీయ ప్రయోజనలే ప్రధానంగా భావిస్తున్నట్లు సమాచారం. ఇదంతా నియోజకవర్గాల పునర్విభజన గురించి. తాజాగా ఇటు రాష్ట్ర అటు కేంద్ర స్థాయిలో బీజేపీ నేతల కదలికలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలోనే తెలంగాణ - ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఎన్నికల కమిషన్ ద్వారా పెంచుకోవచ్చని ప్రస్తావించారు. అయితే - గతంలో ఈ డిమాండ్ ను బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ కు వలస వస్తున్న లీడర్ల కోసం సీఎంలు పట్టుబడుతున్నారని - అసెంబ్లీ సెగ్మెంట్లు పెరిగితే టీఆర్ ఎస్ కే లాభమని రాష్ట్ర బీజేపీ నేతలు భావించారు. కమలం పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవద్దని పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కోరారు. ఇతర పార్టీల నుంచి వలసలను ఆకర్షించడానికే టీఆర్ ఎస్ సీట్లు పెరగాలని కోరుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో సీట్ల పెంపు ప్రతిపాదన పెండింగ్ లో పడిపోయింది.
అయితే, మారిన రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ నేతలు ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ నేతల చేరికలతో ఉత్సాహంలో ఉన్న రాష్ట్ర బీజేపీ అసెంబ్లీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో పట్టుపెరుగుతోందని భావిస్తున్న పార్టీ నేతలు ఈ ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ తో అసెంబ్లీ సీట్లు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ వస్తాయి కాబట్టి తమకు బాగా కలిసొస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనలు పార్టీ హైకమాండ్ ముందు ఉంచినప్పుడు సానుకూలంగా స్పందన వచ్చినట్లు సమాచారం. విభజన చట్టంలోని వెసులు బాటు ప్రకారం - తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కి పెంచుకోవచ్చు.