Begin typing your search above and press return to search.
సౌత్ లో సెగ పుట్టించేందుకు బీజేపీ రెడీ
By: Tupaki Desk | 30 May 2019 2:30 PM GMTరెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ పెద్ద పెద్ద ప్లాన్లు రెడీ చేస్తున్నట్టు సమాచారం. 2014లో బీజేపీ ఉత్తరాధి రాష్ట్రాలపైనే ఆధారపడి గెలుపొందింది. ఇప్పుడు 2019లో కూడా హిందీ బెల్ట్ రాష్ట్రాలే బీజేపీని గద్దెనెక్కించాయి. ఒక్క కర్ణాటక రాష్ట్రం మినహా దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులో బీజేపీ పెద్ద సీట్లను దక్కించుకోలేదు. దీంతో ఆపరేషన్ సౌత్ ను బీజేపీ అమలు చేయడానికి రెడీ అవుతోంది.
*స్టాండ్ బై కోసమే దక్షిణాదిపై ఫోకస్
ప్రతీసారి ఉత్తరాదిపైనే భారం వేసి బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఒక్క కర్ణాటకలో మాత్రమే ఈసారి మెజార్టీ సీట్లు సాధించింది. ఏపీ, కేరళ, తమిళనాడులో తీసికట్టుగా మారింది. తెలంగాణలో 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. దక్షిణాది మొత్తం చాలా తక్కువ సీట్లను గెలుచుకుంది. అందుకే వచ్చేసారి ఉత్తరాధిన దెబ్బపడితే దక్షిణాదిలో బలపడాలని యోచిస్తోంది. అందుకే ఇక రెండోసారి అధికారంలోకి రాగానే అమిత్ షా ఆపరేషన్ దక్షిణాదిని మొదలు పెట్టబోతున్నారు..
*ఒక్కో రాష్ట్రానికి ముగ్గురికి బాధ్యతలు..
అమిత్ షా స్కెచ్ గీసిన ప్రకారం కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చేసారికల్లా ప్రధాన ప్రతిపక్షంగా నిలవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఒక్కో రాష్ట్రానికి ముగ్గురు చొప్పున కేంద్రమంత్రులు, సీనియర్ పార్టీ బాధ్యులను నియమించి ఆయా రాష్ట్రాల్లో బలపడడానికి స్కెచ్ గీస్తున్నారు. ప్రతిపక్షాన్ని కుదేలు చేయడం.. ఆ పార్టీలోని బలమైన నేతలను లాగడం.. బాధ్యతలు అప్పగించి క్షేత్రస్థాయిలో నుంచి పార్టీని బలంగా తయారు చేయడం వీరి విధి..
*ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాల్సిందే..
ఏపీలో ఇప్పుడు టీడీపీ స్తానాన్ని ఆక్రమించడానికి బీజేపీ స్కెచ్ గీసింది. అక్కడ వైసీపీ ప్రభంజనంతో ప్రతిపక్ష హోదా దక్కని టీడీపీ నుంచి కీలక నేతలను లాగేసి వైసీపీకి ప్రత్యామ్మాయంగా వచ్చే ఎన్నికల నాటికి తయారు కావాలని భావిస్తోంది. చావుదెబ్బ తిన్న టీడీపీని మరింత చచ్చేలా చేసి ఎదగాలని ప్లాన్ చేస్తోంది. ఇక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో వైఎస్ జగన్ కూడా బీజేపీ విస్తరణకు అడ్డు చెప్పలేడు. కేంద్రం సాయం కావడంతో అటు టీడీపీని దెబ్బకొట్టడం.. ఇటు బీజేపీ పురోగతిపై కమళనాథులు దృష్టి పెట్టారు..
*తెలంగాణలో భారీగా పుంజుకోవడమే లక్ష్యం
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ సత్తాచాటింది. అదే ఊపులో కేంద్రంలో అండదండలతో కీలక నేతలను లాగి కాంగ్రెస్ ను దెబ్బతీసి ఎదగాలని బీజేపీ చూస్తోంది. అవసరమైతే హరీష్ రావు లాంటి బలమైన నేతలను లాగేసి బీజేపీ సారథ్యం అప్పగిస్తే ఇక బీజేపీకి తిరుగుండదని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టడం.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయంగా ఎదిగేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది..
*కేరళలో హిందుత్వం, శబరిమలే కీలకం..
ఇక ఈ ఎన్నికలకు ముందు కేరళలోని కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టాలని బీజేపీ శతవిధాల ప్రయత్నించింది. శబరిమలలో మహిళల ప్రవేశం సహా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న కేరళ సర్కారును బీజేపీ తీవ్ర ఇబ్బంది పెట్టింది. అయితే అనూహ్యంగా కేరళలో సీపీఎం ప్రభుత్వం ఓడినా.. అక్కడ బీజేపీ పెద్ద సంఖ్యలో బీజేపీ సీట్లు సాధించలేదు. ఇక్కడ కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు సాధించడంతో బీజేపీ ప్లాన్లు వర్కవుట్ కాలేదు..
ఇలా మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఏపీ, తెలంగాణలో బలపడడం ఈజీగానే కనిపిస్తుండగా.. కేరళలో కాస్త టఫ్ ఫైట్ ఉంది. ఇక ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలే తమిళనాట మాత్రం అన్నాడీఎంకే తోనే బలపడాలని యోచిస్తోంది. అక్కడ డీఎంకే హవా ఈ ఎన్నికల్లో నడిచినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చక్రం తిప్పాలని బీజేపీ యోచిస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పుంజుకుంటుందో లేదో చూడాలి మరి.