Begin typing your search above and press return to search.
స్టార్ హీరోకి కాంగ్రెస్ టికెట్ ఖాయం!
By: Tupaki Desk | 20 March 2019 4:50 PM GMTగత ఐదేళ్లలో బీజేపీలో ఉంటూనే..మోడీని తీవ్రంగా విమర్శించిన ఎంపీ షాట్ గన్ శత్రుఘ్న సిన్హా. అలనాటి ఈ బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్.. మోడీకి పెద్ద తలనొప్పిగా మారారు. అనునిత్యం విమర్శలు చేస్తూ వచ్చారు. మోడీ కేబినెట్ లో బెర్త్ ను ఆశించిన ఈ బాలీవుడ్ ఒకనాటి స్టార్ హీరో.. అది దక్కకపోవడంతో ఫైర్ అవుతూ వచ్చారు. మోడీకి చెప్పులో రాయిగా - చెవులో జోరీగగా మారారు. మోడీ వ్యతిరేకులతో చేతులు కలిపి దుమ్మెత్తి పోస్తూ వచ్చారు.
మోడీకి వ్యతిరేకంగా ఎవరైనా ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిస్తే వాటికి కూడా హాజరయ్యారు శత్రుఘ్న సిన్హా. అయితే ఈయనపై చర్యలకు బీజేపీ వెనుకాడింది. సిన్హా పై ప్రతి విమర్శలు చేయలేదు. ఆయనను సస్పెండ్ విషయంలో కూడా మరీ సీరియస్ గా వ్యవహరించ లేదు.
బిహార్ బీజేపీ నేతలు మాత్రం అప్పుడప్పుడు ఈ హీరోని విమర్శించారు. దమ్ముంటే రాజీనామా చేసి బయటకు వెళ్లాలని సూచించారు. అయితే సిన్హా ఆ పని చేయలేదు. బీజేపీ ఎంపీగా కొనసాగుతూనే విమర్శలు చేస్తూ వచ్చాడు. అయితే కీలక బిల్లుల సమయంలో మాత్రం సిన్హా మళ్లీ పార్టీ విప్ కు అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చారు.
ఇక మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ సారి మాత్రం కమలనాథులు శత్రుఘ్నకు అవకాశం ఇచ్చేలా లేరు. పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ హీరోకి ఈ సారి బీజేపీ టికెట్ దక్కే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఈ హీరో పరిస్థితి ఏమిటి..అంటే కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందని సమాచారం.
శత్రుఘ్న వచ్చి చేరితే ఆయనకు టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ వాళ్లు రెడీగా ఉన్నారట. మరి శత్రుఘ్న కాంగ్రెస్ లో చేరి తన తదుపరి రాజకీయాన్ని కొనసాగిస్తారేమో చూడాలి!