Begin typing your search above and press return to search.

వ్యాపం మధ్యప్రదేశ్ స్థానికంలో కమలం జోరు

By:  Tupaki Desk   |   17 Aug 2015 4:40 AM GMT
వ్యాపం మధ్యప్రదేశ్ స్థానికంలో కమలం జోరు
X
వ్యాపం కుంభకోణం పేరు విన్నంతనే మధ్యప్రదేశ్ రాష్ట్రం గుర్తుకు వస్తుంది. ఈ కుంభకోణంతో మధ్యప్రదేశ్ లోని బీజేపీ సర్కారు ప్రతిష్ఠ అడుగంటిపోయిందని.. ఆ పార్టీకి జరిగిన డ్యామేజ్ అంతాఇంతా కాదన్న అంచనాలు వ్యక్తం కావటం తెలిసిందే. అధికారపక్షంగా ఉన్న రాష్ట్రంలో పట్టు చేజారిపోతుందన్న భావన వ్యక్తమైనప్పటికీ అది నిజం కాదంటూ తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్ని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

వ్యాపం కుంభకోణంతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన మధ్యప్రదేశ్ సర్కారు పట్ల.. ఆ రాష్ట్ర ప్రజల్లో మాత్రం అభిమానం పదిలంగా ఉందన్న విషయం తాజాగా వెల్లడైన స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి. ఆ రాష్ట్రంలోని మొత్తం 10 స్థానిక సంస్థల్లో ఎనిమిదింటిని బీజేపీ సొంతం చేసుకోగా మరో రెండింటిని మాత్రమే చేజార్చుకుంది.

చేజారిన రెండు స్థానాల్లోనూ ఒకటి కాంగ్రెస్ సొంతం చేసుకుంటే.. మరొకటి స్వతంత్య్రులు సొంతం చేసుకోవటం గమనార్హం. మొత్తంగా వ్యాపంతో కష్టాలు పడుతున్న మధ్యప్రదేశ్ బీజేపీకి తాజా ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటం ఖాయమని చెబుతున్నారు. వ్యాపం కుంభకోణంతో ఎంపీలోని బీజేపీ సర్కారు ప్రతిష్ఠ ఏ మాత్రం దిగజారలేదన్న విషయం తాజా విజయంతో వెల్లడైందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.