Begin typing your search above and press return to search.
సీఎం - మంత్రులు అంత్యక్రియల్లో జోకులు...వీడియో వైరల్
By: Tupaki Desk | 21 Oct 2018 4:49 PM GMTసంచలన పరిణామాలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా వివాదాస్పద ఉదంతంతో తెరమీదకు వచ్చారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే...ఆయనకు తలవంపులు తెచ్చే పరిణామం ఇది. ప్రముఖ నాయకుడి అంత్యక్రియల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా జోకులు వేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూపీ - ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ అంత్యక్రియల్లో యోగితోపాటు పాటు ఆయన కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు జోకులేసుకుంటూ నవ్వుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా నెటిజన్లు వారి తీరుపై విరుచుకుపడేందుకు ఆస్కారమిచ్చింది.
ఉమ్మడి ఏపీ గవర్నర్ గా పనిచేసిన ఎన్డీ తివారీ భౌతికకాయాన్ని శనివారం యూపీ అసెంబ్లీకి తీసుకెళ్లారు. ఆయన మృతికి నివాళులర్పించడానికి రాష్ర్టానికి చెందిన సీనియర్ రాజకీయ వేత్తలు వచ్చారు. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ - బీహార్ గవర్నర్ లాల్జీ టాండన్ తోపాటు మంత్రులు మోహ్ సిన్ రజా - అశుతోష్ టాండన్ జోకులేసుకుంటూ నవ్వుతున్న వీడియో బయటకు వచ్చింది. తివారీ భౌతిక కాయం పక్కనే కూర్చొని ఈ నలుగురూ ఇలా నవ్వడం చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్ - సమాజ్ వాదీ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇదీ బీజేపీ నిజ స్వరూపం అంటూ సమాజ్ వాదీ పార్టీ విమర్శించింది.