Begin typing your search above and press return to search.
పప్పు పేరు తీసేశారు..మరేం పెట్టారో తెలుసా?
By: Tupaki Desk | 16 Nov 2017 11:06 AM GMTదేశంలో మరే రాష్ట్రంలోని వారికి లేని కన్ఫ్యూజన్.. రెండు తెలుగు రాష్ట్రాల వారికే ఉంది. వారి దగ్గర పప్పు మాట విన్నంతనే.. ఏ పప్పు గురించి మాట్లాడుతున్నావ్ అని అడిగేస్తారు. ప్రత్యర్థులను ఆట పట్టించేందుకు కీలక నేతలకు కొన్ని పేర్లు పెట్టటం మామూలే. అదే రీతిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి విపక్షాలు పప్పు పేరుతో పిలుస్తుంటాయి.
అదే రీతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు కమ్ మంత్రి నారా లోకేశ్ ను రాజకీయ ప్రత్యర్థులు పప్పు పేరుతో పిలుస్తుంటాయి. ఇదెంత ఫేమస్ అయ్యిందంటే.. ఆ మధ్యన గూగుల్ లో పప్పు అని కొడితే చినబాబు ఫోటోలు కనిపించినట్లుగా వాట్సాప్ లో మెసేజ్ లు వచ్చాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న తెలుగు తమ్ముళ్లు గూగుల్ లో అలా రాకుండా చర్యలు తీసుకున్నట్లు చెబుతారు.
లోకేశ్ విషయాన్ని పక్కన పెట్టి జాతీయ రాజకీయాల విషయంలోకి వెళితే.. హాట్ హాట్ గా సాగుతోంది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు. గెలుపు మీద ఆశ లేకున్నా.. ఇప్పుడున్న సీట్లను తగ్గించినా విజయం సాధించినట్లేనని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని అంతకంతకూ ముమ్మరం చేస్తుంది. గుజరాత్ ఫలితం దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెష్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదన్నట్లుగా కమలనాథులు కసరత్తు చేస్తున్నారు.
తమకు చిక్కిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు. రాహుల్ ను పప్పు పేరిట ఎటకారం చేసుకోవటాన్ని తమ ప్రచారానికి వాడుకునే ప్రయత్నం చేయటం.. ఇందుకు ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయటంతో పప్పు పేరిట విడుదల చేద్దామనుకున్న బీజేపీ ఎన్నికల యాడ్ కు బ్రేకులు పడ్డాయి. దీంతో.. తెగ అంతర్మధనం చేసిన కమలనాథులు పప్పు స్థానంలో యువరాజు పేరుతో యాడ్‌ను సిద్ధం చేశారు. రాహుల్ ను పప్పుగా ఎటకారం చేసుకునే బీజేపీ నేతలకు యువరాజు దొరికింది. మరి.. వచ్చే ఎన్నికల్లో లోకేశ్ ను పప్పు పేరుతో ఎటకరాం చేయాలనుకునే ఆయన ప్రత్యర్థులకు మరే పదాన్ని సిద్ధం చేసుకుంటారో చూడాలి.