Begin typing your search above and press return to search.

ఆదాయంలో సరిలేరు బీజేపీకెవ్వరూ.!

By:  Tupaki Desk   |   10 Jan 2020 6:07 AM GMT
ఆదాయంలో సరిలేరు బీజేపీకెవ్వరూ.!
X
ఒక రాజకీయ పార్టీ నడవాలంటే దానికి విరాళాలు తప్పనిసరి. ఇక టికెట్లు తీసుకునే నేతలు ఎంతో కొంత పార్టీ అధిష్టానానికి విరాళాలుగా ఇచ్చి ఆ సీట్లు కొల్లగొడుతారు. ఇది అనాదిగా జరుగుతున్న ప్రక్రియే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ కి కోట్లకు కోట్లు విరాళాలు వస్తుంటాయి. ప్రభుత్వాలతో పని ఉండే పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు.. సీట్లు ఆశించే ఆశావహులు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తుంటారు.

ఈ కోవలోనే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, ఖర్చుల వివరాలను ఎలక్షన్ కమిషన్ కు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సమర్పించింది. ఆ పార్టీ సమర్పించిన ఆఫిడవిట్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం. ఎందుకంటే ఏకంగా బీజేపీకి 134శాతం ఆదాయం పెరగడం విశేషం.

2018-19 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2410 కోట్ల ఆదాయం బీజేపీకి రాగా.. 2017-18లో ఆదాయం కేవలం 1027 కోట్లు మాత్రమే. అంటే ఒక్క ఏడాది లోనే బీజేపీ ఆదాయం ఏకంగా 1400 కోట్ల కు పైగానే పెరగడం విశేషం.

ఇక బీజేపీ ఖర్చు కూడా భారీగానే పెట్టింది. ఎన్నికల సంవత్సరమైన 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1005 కోట్లు ఖర్చు చేసినట్టు ఎలక్షన్ కమిషన్ కు బీజేపీ లెక్కలు చూపింది.

ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆదాయం కేవలం 918 కోట్లు మాత్రమే. 2017-18లో కాంగ్రెస్ ఆదాయం 199 కోట్లే. 2018-19 ఎన్నికల వేళ మాత్రం 918 కోట్ల ఆదాయం వచ్చింది. ఖర్చులు 470 కోట్లుగా చూపెట్టింది. అధికారం కోల్పోవడంతో ఐదేళ్లలో కాంగ్రెస్ ఆదాయం గణనీయంగా పడి పోయింది.