Begin typing your search above and press return to search.

కేటీఆర్ సోకుల‌పై బీజేపీ సెటైర్లు ! వామ్మో ! ర్యాగింగ్ మాములుగా లేదుగా..

By:  Tupaki Desk   |   10 Jun 2022 11:30 AM GMT
కేటీఆర్ సోకుల‌పై బీజేపీ సెటైర్లు ! వామ్మో ! ర్యాగింగ్ మాములుగా లేదుగా..
X
ప్ర‌స్తుతం బీజేపీ,టీఆర్ఎస్ మ‌ధ్య మాట‌ల వైరం నడుస్తోంది. గ‌తంలో లేని విధంగా ఈ మాట‌ల యుద్ధం సాగుతోంది. దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి కేటీఆర్ పై బీజేపీ ఓ రేంజ్-లో జోకులు వేస్తోంది. ఉన్న‌ది ఉన్నట్లు మాట్లాడ‌డం వ‌ల్ల ఎవ్వ‌రికైనా కోపం వ‌స్తే రావొచ్చు కానీ తాము మాత్రం త‌గ్గేదే లే అన్న పంథాలో వెళ్తోంది బీజేపీ నాయ‌క‌త్వం. దీంతో మ‌ళ్లీ దావోస్ లెక్క‌లు.. కేటీఆర్ సోకులు అన్నీ అన్నీ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

రోజుకు 1.3 కోట్ల రూపాయ‌ల చొప్పున దావోస్ లో ఉన్నప్పుడు కేటీఆర్ ఖ‌ర్చు చేశారు అని, ఆ లెక్క‌న ఆయన మొత్తం ఖ‌ర్చు 13.22 కోట్లు అని తేలిందని బీజేపీ వాపోతుంది. ఇంత మొత్తంలో ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేయ‌డం త‌గ‌ద‌ని కూడా అంటోంది.

దావోస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేటీఆర్ సాధించింది ఏమ‌యినా ఉందా అని కూడా లెక్క‌లు తీస్తోంది. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి డ‌బ్బులు వృథా చేయ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తోంది. ఇదే స‌మ‌యంలో దావోస్ కు వెళ్లాక విదేశీ పెట్టుబ‌డుల సాధ‌న‌కు ఏం కృషి చేశారో కూడా చెప్పాల‌ని ప‌ట్టుబ‌డుతోంది.

ఇక ఇవే మాట‌ల‌పై టీఆర్ఎస్ ఏ విధంగా స్పందించ‌నుంది అన్న‌ది ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. దావోస్ లో ఏపీ కన్నా టీజీనే ఎక్కువ పెట్టుబడులు సాధించింద‌ని గ‌తంలో ఓ సారి కేటీఆర్ చెప్పారు. పెట్టుబ‌డుల ఆక‌ర్షణ‌కు తాను చేసిన కృషి ఫ‌లించింద‌ని కూడా చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీలే త‌మ‌ను చూసి అబ్బురప‌డిపోతున్నాయ‌ని కూడా చెప్పారు.

ఈ మాట‌ల ఫ‌లితంగా ల‌క్ష కోట్ల కు పైగా పెట్టుబ‌డులు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని కూడా చెప్పారు. ఏ విధంగా చూసుకున్నా తాము ప‌రిపాలించిన కాలంలో 16.48ల‌క్ష‌ల ఉద్యోగాలు, 2.32 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు వ‌చ్చాయని కూడా చెప్పారు. 19,454 ప‌రిశ్ర‌మ‌ల‌కు తాము అనుమ‌తులు ఇచ్చామ‌ని వెల్ల‌డించి కేటీఆర్ అంద‌రినీ ఆక‌ర్షించారు.

ఇదే స‌మ‌యాన కేటీఆర్ మాట‌ల ఆక‌ర్ష‌ణ ఎలా ఉన్నా రాష్ట్రానికి సంబంధించి నిధుల వెచ్చింపుల్లో కాస్త‌యినా నియంత్ర‌ణ ఉంటే బాగుంటుంది అని బీజేపీ మరోసారి హిత‌వు చెబుతోంది.