Begin typing your search above and press return to search.
ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ ఖాయం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 29 Dec 2022 2:34 PM GMTబీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ముచ్చటపై ఆయన మాట్లాడుతూ.. ఔను..ఏపీలో ఉన్న పరిస్థితిని గమనిస్తే.. అదిది ఖాయమని తెలుస్తోంది! అని వ్యాఖ్యానించారు. అయితే.. అదేసమయంలో కేంద్రంలోని తమ ప్రభుత్వానికి మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. తాము యధావిధిగా.. సమయం ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.
అంతేకాదు.. ఏపీలో ఇప్పుడు నెలకొన్న అప్పుల పరిస్థితిని గమనిస్తే.. త్వరలోనే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించినా ఆశ్చర్యం లేదన్నారు. ‘‘రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఉంది. పరిపాలన రాజధాని పేరుతో జగన్ కొండలను పిండి చేస్తున్నారు. అప్పులు విషయంలో తప్పులు చెబుతున్నారు. 9 లక్షల కోట్ల అప్పులు ఈ రాష్ట్రం చేసింది.. కానీ మూడు లక్షల కోట్లే అని చెబుతున్నారు`` అని సత్య కుమార్ మండిపడ్డారు.
అంతేకాదు.. అప్పుల విషయాన్ని.. ఆర్థిక దుబారాను ప్రస్తావిస్తే.. చెప్పుతో కొట్టమని మంత్రులు సిగ్గులేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ``పోలవరంపై గతంలో చేసిన ఆరోపణలు ఏమైయ్యాయి? పోలవరం ప్రాజెక్టును గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏటీఎంలా వాడుకున్నాయి. మోడీ దగ్గర జగన్ అన్ని అబద్ధాలే చెప్పారు. మెట్రో రైలు విషయంలో జగన్ అబద్ధాలు ఆడుతున్నారు`` అని వ్యాఖ్యానించారు.
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై జగన్‌ను ప్రజలు తప్పుబడుతున్నారని సత్యకుమార్ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం సీఎం మాట్లాడటం దివాలా కోరుతనం బయట పడిందన్నారు. వైసీపీతో బీజేపీకి మ్యాచ్ ఫిక్సింగ్ లేదన్న ఆయన జనసేనతోనే పొత్తు ఉందన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.