Begin typing your search above and press return to search.
అధికార పార్టీకి సీఎం అభ్యర్థి కావలెను!
By: Tupaki Desk | 9 Jan 2017 7:51 AM GMTకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కొత్త సమస్య ఒకటి తెరమీదకు వచ్చింది. యూపీ అంతటా బీజేపీ శాసనసభ ఎన్నికల ప్రచార హోరు సాగుతుండటమే కాకుండా ప్రధాని మోడీ వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ లో ప్రధాని మోడీ - పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తోపాటు మరో నలుగురి ఫోటోలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు మరో నెలలోనే జరగనుండగా ఈ నలుగురిలో ఏ ఒక్కరినీ బీజేపీ ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించలేదు. 2014 ఎన్నికల్లో విజయఢంకా మోగించిన బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేని పరిస్థితి ఉండడం సమస్యగా ఉంది. దీనికితోడు ఇటీవల నిర్వహించిన సర్వేలో అత్యధిక పాపులారిటీ ఉన్న నేత అఖిలేష్ యాదవ్ అని తేల్చడం బీజేపీకి మరింత నష్టాన్ని కలుగుజేస్తోంది. తమ పార్టీలో అలాంటి చరిష్మా ఉన్న నాయకుడు లేడని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు.
యూపీ బీజేపీ రాజకీయాల్లో ప్రముఖంగా నాలుగు ముఖాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటి వారు కేశవ్ ప్రసాద్ మౌర్య.. రెండు జిల్లాలకే పరిమితమైన ప్రసాద్ మౌర్యను ఓబీసీ ఓట్లను ఆకర్షించేందుకు గాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అయినప్పటికీ ఈయన చరిస్మా కలిగిన నేతగా ఎదగలేకపోయారు. తన కులం తప్ప ఇతర కులాల ప్రజలను ఆకర్షించడంలో ఈయన విఫలమౌతున్నారు. రాష్ట్రం నుండి అత్యంత సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్. ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన ఈయన కేంద్రంలో మంత్రి పదవిలో ఉన్నారు. తాను కేంద్రంలోనే ఉంటానని, రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. పోస్టర్లపై ఉన్న మూడో వ్యక్తి కల్ రాజ్ మిశ్రా. ఈయన ఇప్పటికే 75 ఏళ్ల వయస్సు దాటేశారు. యూపీలో ఉన్న బ్రహ్మణ ఓటర్లను ఆకర్షించేందుకే ఈయనకు మోడీ మంత్రిమండలిలో స్థానం ఇంకా మిగిలిఉంది. ఇక నాలుగో వ్యక్తి ఫైర్ బ్రాండ్ ఉమా భారతి. లోధా కమ్యూనిటికి చెందిన ఉమా భారతిని కూడా సీఎం అభ్యర్ధిగా ప్రకటించే స్థితిలో బీజేపీ లేదు. ఈమె నేతృత్వంలో 2012లో బిజెపి ఎన్నికలకు వెళ్లగా..గత 20 ఏళ్లలో చూడనంత హీనమైన ఫలితాలను పార్టీ చవిచూసింది. నాలుగు సామాజిక వర్గాలకు నలుగురు ప్రతినిధులు అన్నట్లుగా ఈ నలుగుర్ని హోర్డింగ్స్ - పోస్టర్స్‌పై చూపిస్తున్నారు తప్ప సీఎం అభ్యర్ధులుగా మాత్రం కాదని స్థానిక బిజెపి నేతలే అంటున్నారు.
ఇక విపక్షాల సంగతి చూస్తే....సమాజ్ వాది పార్టీకి అఖిలేష్ యాదవ్ ఉన్నారు. బీఎస్పీకి మాయావతి ఉన్నారు. బీజేపీ కి మాత్రం ఆ స్థాయి ముఖ్యమంత్రి అభ్యర్ధి లేరు. అందుకు మోడీ - అమిషానే కారణమని స్థానిక పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ అధినాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ మాదిరి రాష్ట్రాల స్థాయిలో బలమైన నాయకత్వాన్ని ఎదగనివ్వడం లేదని అంటున్నారు. అంతా మోడీ - అమిత్ షాలే పార్టీని నడిపిస్తున్నారని చెబుతున్నారు. దీంతో సీఎం అభ్యర్ధిగా ఎవర్ని ప్రకటించాలనే డైలమాలో బీజేపీ పడిపోయింది. ఒక కులానికి చెందిన నాయకుణ్ని ప్రకటిస్తే ఇతర కులాలకు చెందిన ఓటర్లు దూరమౌతారనే భయంతో ఉంది. దీంతో బీహార్ లో మాదిరిగానే నరేంద్ర మోడీ ఇమేజ్ పైనే యూపీ ఎన్నికలను కూడా లాగించాలని భావిస్తోంది. మరి బీహార్ లాంటి ఫలితాలు వస్తాయా.. లేక మరో ఫలితం వస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/