Begin typing your search above and press return to search.
ఆత్మకూరులో కూడా బద్వేలు పద్దతేనా ?
By: Tupaki Desk | 6 Jun 2022 5:33 AM GMTతాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక విషయంలో ఒక క్లారిటి వచ్చేసింది. అదేమిటంటే ఆత్మకూరులో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్ధికి జనసేన మద్దతు ఉండదని తేలిపోయింది. ఆత్మకూరు ఉపఎన్నికలో ఇటు పవన్ అటు బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి వేర్వేరు సిద్ధాంతాలను వినిపించారు. తాము పవన్ తో చర్చించిన తర్వాతనే పోటీచేయబోతున్నట్లు ప్రకటించినట్లు పురందేశ్వరి చెప్పారు.
ఇదే సమయంలో ఆత్మకూరులో తాము పోటీచేయకూడదని డిసైడ్ చేసినట్లు చెప్పారు. దీంతోనే ఉపఎన్నికకు జనసేన దూరమని పవన్ చెప్పకనే చెప్పారు. బద్వేలు ఉపఎన్నికలో కూడా ఇలాగే జరిగింది. బీజేపీ పోటీచేయగా జనసేన నేతలు పూర్తిగా దూరంగా ఉన్నారు.
అంటే బీజేపీ అభ్యర్ధికి జనసేన నుండి ఏ రకంగాను సహకారం అందలేదు. అందుకనే వేరేదారిలేక పోలింగ్ ఏజెంట్లుగా బతిమలాడుకుని, ప్రత్యేక ప్యాకేజీ మాట్లాడుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలను పెట్టుకున్నది బీజేపీ.
సో ఇపుడు ఆత్మకూరులో కూడా జరగబోయేది ఇదే అని పవన్ ప్రకటనబట్టి తెలుస్తోంది. పోటీకి దూరంగా ఉన్న తర్వాత ఇక జనసేన నేతలు ప్రచారానికి మాత్రం ఎందుకు వస్తారు ? అంటే ఉపఎన్నిక ప్రచారానికి కూడా పవన్ తో పాటు యావత్ జనసైనికులు దూరంగానే ఉండబోతున్నారని అర్ధమైపోయింది. మరి ఒంటరిగా పోటీచేయబోతున్న బీజేపీకి ఇక్కడ ఎన్ని ఓట్లు వస్తాయో చూడాల్సిందే.
ఉపఎన్నికల్లో మిత్రపక్షాల్లో ఏ పార్టీదారి ఆ పార్టీదే అన్నట్లుంటే ఇక మిత్రపక్షాలనే ట్యాగ్ లైన్ ఎందుకో అర్ధం కావటంలేదు. పేరుకుమాత్రమే రెండుపార్టీలు మిత్రపక్షాలే కానీ ఆచరణలో ఎక్కడా కనబడటంలేదు. ఆందోళనలు చేసినా, నిరసనలు చేసినా చివరకు మీడియా సమావేశాల్లో కూడా రెండుపార్టీల నేతలు ఎవరిదారి వాళ్ళదే అన్నట్లున్నారు.
ఢిల్లీనుండి బీజేపీ నేతలు ఎవరొచ్చినా జనసేన నేతలు కలవటంలేదు. 6, 7 తేదీల్లో విజయవాడ, రాజమండ్రిలో పర్యటించబోతున్న బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డాను కలవటానికి కూడా పవన్ ఇష్టపడటంలేదు. దీంతోనే రెండుపార్టీల మధ్య పొత్తు ఎంత దివ్యంగా ఉందో అర్ధమైపోతోంది.