Begin typing your search above and press return to search.

సిట్టింగ్ ఎమ్మెల్యేల బంధువులకి బీజేపీ బిగ్ షాక్ !

By:  Tupaki Desk   |   7 Oct 2020 2:30 AM GMT
సిట్టింగ్ ఎమ్మెల్యేల బంధువులకి బీజేపీ బిగ్ షాక్ !
X
అతి త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారమే ద్యేయంగా పావులు కదుపుతుంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి షాక్ తప్పదా అంటే తప్పదు అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల సమాచారం మేరకు ఈసారి ఆరు మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేల బంధువులెవ్వరికీ టిక్కెట్లు ఇవ్వరాదనే విషయాన్ని కూడా బీజేపీ సీరియస్‌ గానే పరిశీలన చేస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనే విషయంలో బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటికీ పలు దఫాలు చర్చలు జరిపారు. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈనెల 4న సమావేశమై ఎవరెవరు, ఏయే నియోజకవర్గంలో పోటీ చేయాలనే విషయంపై చర్చించింది.

అలాగే భాగస్వామ్య పార్టీ అయిన జేడీయూకు అభ్యంతరం లేని స్థానాలను పరిగణనలోకి తీసుకుంటూ తొలి విడతలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లును ఆదివారం రాత్రి తర్వాత ఖరారు చేసింది. సీఈసీ మీటింగ్‌ లో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. రెండో విడత పోటీకి రాష్ట్ర యూనిట్ సిఫారసు చేసిన అభ్యర్థుల బలాబలాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఇక , తొలి విడతలో పోటే చేసే వారి మొత్తం జాబితాతో పాటు రెండో విడతలో పోటీ చేసే కొందరు అభ్యర్థుల జాబితాను బీజేపీ సోమవారంనాడు ప్రకటించింది.

రెండో విడతలో జేడీయూ క్లెయిమ్ చేసుకున్న కొన్ని నియోజకవర్గాల జోలికి బీజేపీ పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక డజను సీట్ల విషయంలో మాత్రం జేడీయూతో బీజేపీ ప్రస్తుతం సంప్రదింపులు చేస్తుంది. 2015లో బీజేపీ ఈ సీట్లలో గెలుపొందగా, ఈసారి మాత్రం ఆ స్థానాల్లో తాము పోటీచేయాలని జేడీయూ పట్టుదలతో ఉంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు గాను తొలి విడత 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా, నామినేషన్ల ప్రక్రియ ఈనెల 1న ప్రారంభమైంది. 8వ తేదీతో నామినేషన్ల పర్వం ముగుస్తుంది.