Begin typing your search above and press return to search.

మ‌త మార్పిడుల‌ పై క‌ర్నాట‌క స‌ర్కార్ కొర‌డా...!

By:  Tupaki Desk   |   19 Dec 2021 8:59 AM GMT
మ‌త మార్పిడుల‌ పై క‌ర్నాట‌క స‌ర్కార్ కొర‌డా...!
X
బీజేపీ సిద్ధాంతాల్లో కీల‌క‌మైంది ఏంటి? అంటే.. త‌డుము కోకుండా చెప్పేది.. మ‌త మార్పిడుల‌ను ప్రోత్స హించ‌క‌పోవ‌డం. మ‌త మార్పిడులు ఏరూపంలో ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీ ఒప్పుకోదు. ఇది బీజేపీ ట్యాగ్‌లైన్ అయిన హిందూత్వ అజెండాలో కీల‌కం. ఈ దిశ‌గా కేంద్రంలోని బీజేపీ అనేక సంస్క‌ర‌ణ‌లు కూడా తీసుకు వ‌చ్చింది. అయితే.. ఇవ‌న్నీ.. తెర‌చాటు వ్య‌వ‌హారాలుగానే ఉన్నాయి. కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం వీటిని అధికారికంగానే అమ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌త మార్పిడుల‌పై.. ఉక్కు పాదం మోపుతామ‌ని.. సాక్షాత్తూ.. సీఎం యోగి ప్ర‌క‌టించారు.

ఇక‌, ఇప్పుడు ద‌క్షిణాదిలోని క‌ర్ణాట‌క‌లోనూ మ‌త‌మార్పిడుల‌పై కొర‌డాఝ‌ళిపించేందుకు ఇక్క‌డి బీజేపీ ప్ర భుత్వం సిద్ధ‌మైంది.గ‌తంలోనే మాజీ సీఎం య‌డియూర‌ప్ప తీసుకువ‌చ్చిన కొన్ని బిల్లుల‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టి.. అంగీకారం పొంది.. అమ‌లు చేసుకునేందుకు రాష్ట్ర బీజేపీ స‌ర్కారు రెడీ అయింది. దీని ప్ర‌కారం.. మ‌తం మార్చుకునే వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున అందే ఏ ప‌థ‌కాన్నీ అమ‌లు చేయ‌రు. అప్ప‌టి వ‌ర‌కు ల‌బ్ధి పొందుతున్న వాటిని కూడా ఆపేస్తారు. `యాంటీ క‌న్వ‌ర్ష‌న్ బిల్`(మ‌త మార్పిడిల వ్య‌తిరేక బిల్లు)లో .. ప్ర‌ధానంగా మ‌తం మారిన వారిని ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలను అన‌ర్హులుగా ప్ర‌క‌టించ‌నున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు మ‌తం మారిన ఎస్సీల‌కో, ఎస్టీల‌కో, బీసీల‌పైనే ఈ ప‌థ‌కం కొర‌డా ఝ‌లిపించ‌నుంది. ఇక ఈబీసీ కేట‌గిరిలో ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు పొందే వారు కూడా మ‌తం మార్చుకుంటే ఇలాంటి ప‌థ‌కాల లబ్ధికి దూరం కానున్నారు. ఇలా చేయ‌డం ద్వారా.. మ‌త మార్పిడిల‌ను నివారించాల‌ని క‌ర్ణాట‌క‌లోని బీజేపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. అంతేకాదు.. మ‌రిన్నికీల‌క‌మైన అంశాల‌ను కూడా ఈ బిల్లులో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.

మ‌తమార్పిడుల‌కు పాల్ప‌డే వారికి కూడా క‌ఠిన శిక్ష‌ల‌ను ఈ బిల్లులో పేర్కొన‌నున్నార‌ట‌. క‌నీసం మూడేళ్ల జైలు, ఎక్కువ‌గా మార్పిడులు చేస్తే మ‌రింత క‌ఠిన‌మైన శిక్ష‌లు వేయ‌నున్నార‌ట‌. ఇక ఎవ‌రైనా త‌మ‌ను బ‌లవంతంగా మ‌తం మార్పించారు.. అని చెబితే వారికి ఐదు ల‌క్ష‌ల ప‌రిహారాన్ని కూడా ఇవ్వ‌నున్నార‌ట‌. మ‌తం విష‌యంలో వారిని బాధితులుగా గుర్తించి, వారికి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఇవ్వ‌నున్నార‌ట‌. అయితే.. దీనిపై విప‌క్షాలు ఇప్ప‌టికే.. ఉద్య‌మాలు ప్రారంభించాయి. మ‌త మార్పిడి అనేది వ్య‌క్తిగ‌త అంశం. పైగా సెక్యుల‌ర్ దేశంలో ప్ర‌బుత్వాలు.. పాల‌కులు.. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ జోలికి పోరాదు. అన్ని మ‌తాల‌ను స‌ర్వ‌స‌మానంగా చూడాలి. కానీ, బీజేపీ మాత్రం దూకుడు త‌గ్గించ‌డం లేదు. మ‌రి ఇది ఏ దిశ‌గా అడుగులు వేస్తుందో చూడాలి.