Begin typing your search above and press return to search.
బీజేపీపై సంఘ్ పరివార్ ఆగ్రహం..!
By: Tupaki Desk | 26 May 2015 6:44 AM GMTఎన్నికల హామీలను నిలబెట్టుకోలేదని మోడీ సర్కారుపై మండిపడింది ఆర్‌ఎస్‌ఎస్. తక్షణం రామమందిర నిర్మాణం చేపట్టాలని.. ఈ విషయంలో ఇచ్చిన హామీని నెలబెట్టుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం దిశగా ఏం చర్యలు తీసుకొంటున్నారో కూడా చెప్పాలని డిమాండ్ చేసింది. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌తో వీహెచ్‌పీ కూడా ఈ విషయంలో గొంతు కలపడం విశేషం.
మోడీ పాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీలు ఇలా డిమాండ్‌తో తమ నిరసన తెలిపాయి. అలాగే కాశ్మీర్ విషయంలో అమల్లో ఉన్న ఆర్టికల్ 370ని కూడా రద్దు చేయాలని ఈ సంస్థలు డిమాండ్ చేశాయి.
ఇవన్నీ బీజేపీ ఎన్నికల హామీలుగా పేర్కొందని.. అయితే ఇప్పుడు ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ మొహం చాటేస్తోందని వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. మోడీ సర్కారుపై తమది నిరసన వైఖరేనని స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి తమ అజెండాలో రామమందిర నిర్మాణం లేదని ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘ్‌పరివార్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
రామమందిర నిర్మాణం చేపట్టాల్సిందేనని భారతీయ జనతా పార్టీ మద్దతుదారులైన ఈ సంస్థల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం వీరిని పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు.