Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ వ‌ర్సెస్ వైసీపీ ఎపిసోడ్‌పై బీజేపీ సైలెంట్ రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   28 Sep 2021 10:30 AM GMT
ప‌వ‌న్ వ‌ర్సెస్ వైసీపీ ఎపిసోడ్‌పై బీజేపీ సైలెంట్ రీజ‌నేంటి?
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌ర్సెస్ అధికార పార్టీ వైసీపీకి మ‌ధ్య రాజుకున్న వివాదం తీవ్ర‌స్థాయికి చేరింది. సినిమా టికెట్ల వ్య‌వ‌హారం.. ముదిరి.. రాజ‌కీయంగా మారింది. అయితే.. ఇంత జ‌రిగినా.. ప‌వ‌న్ మిత్ర ప‌క్షం.. బీజేపీ నేత‌లు.. ఒక్క‌రంటే.. ఒక్క‌రు జోక్యం చేసుకోలేదు. క‌క‌నీసం.. ప‌వ‌న్ చేసిన రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న పెట్టి.. సినిమా టికెట్ల విష‌యాన్న‌యినా.. ప‌ట్టించుకుని.. ప‌వ‌న్ త‌ర‌ఫున గ‌ళం వినిపించే అవ‌కాశం ఉంది. అయితే.. ఈ విష‌యంలోనూ బీజేపీ నేత‌లు ప‌వ‌న్ ను ప‌క్క‌న పెట్టార‌నే ధోర‌ణిని క‌న‌బ‌రిచారు.

ప్ర‌స్తుతం .. రాష్ట్ర‌వ్యాప్తంగా.. బీజేపీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని సేవా స‌మ‌ర్ప‌ణ్ పేరిట‌.. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. నిత్యం మీడియాకు అందుబాటులోనే ఉంటోంది. అయిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ -పేర్ని కానీ, ప‌వ‌న్-వైసీపీ విష‌యాన్ని కానీ.. ప‌ట్టించుకోలేదు. అంతేకాదు.. బీజేపీ ఏపీ సార‌థి సోము వీర్రాజు సాక్షాత్తూ.. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. సో.. కాపుల విష‌యంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న స్పందించే అవ‌కాశం ఉందని అనుకున్నారు. అయినా.. కూడా సోము స్పందించ‌లేదు.

మ‌రోవైపు.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ నుంచి ప‌వ‌న్ విష‌యంలో ఆశించిన స్పంద‌న రాక‌పోగా.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో తమకు సంబంధం లేదని ఏపీ-తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తేల్చి చెప్పింది. కరోనా నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు తెలుగు ప్రభుత్వాల మద్దతు కావాల్సి ఉంటుంద‌ని.. పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వంతో ఇండస్ట్రీకి ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే.. సినీ ప‌రిశ్ర‌మ నుంచి చిన్న‌పాటి యాక్ట‌ర్లు.. సంపూర్ణేష్ బాబు వంటి వారు మాత్ర‌మే స్పందించారు. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. కానీ, కీల‌క‌మైన మిత్ర‌ప‌క్షం.. బీజేపీ మాత్రం ఈ ఎపిసోడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు పెద‌వి విప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు ఏ మాత్రం ఆసక్తిగా ఉన్నట్లు కనిపించట్లేదు. ఇప్పటిదాకా బీజేపీకి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా ఈ విషయంలో పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నోరు విప్ప‌లేదు.అస‌లు ఈ విష‌యం త‌మ‌కు తెలియ‌దు అన్న‌ట్టుగా.. బీజేపీ రాష్ట్రశాఖ వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న ఉంది.

దీన్ని బట్టి చూస్తోంటే ఈ వ్యవహారం మొత్తం పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయంగా భావిస్తోందే తప్ప పార్టీప రంగా తీసుకోవట్లేదని బీజేపీలోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన క‌న్నా లక్ష్మీనారాయ‌ణ కూడా సైలెంట్ అయ్యారు. ఇదిలావుంటే..ప‌వ‌న్ ప‌రిస్థితి అటు అధికార పార్టీ నుంచి వ‌రుస పెట్టి కాపు మంత్రులు కూట‌మి క‌ట్టిన‌ట్టు విరుచుకుప‌డ్డారు. వీరిలో వైశ్య మంత్రి వెలంప‌ల్లి కూడా ఉన్నారు. ఇక‌, ఇండ‌స్ట్రీలోని.. వైసీపీ సానుభూతి ప‌రులు కూడా విరుచుకుప‌డ్డారు.

సో.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప‌వ‌న్ ఒంట‌రి అయ్యార‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మ‌లో రాజకీయ మిత్రుడిని ఆదుకోవడానికి బీజేపీ ముందుకు రావట్లేదనే చర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని బ‌ట్టి. వీరి మ‌ధ్య బంధం ఉన్న‌ట్టా? లేన‌ట్టా.?? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రి ఏం స్పందిస్తారో.. ఎప్పుడు స్పందిస్తారో.. చూడాలి.