Begin typing your search above and press return to search.
ఆపరేషన్ గరుడకు మూలం ఎన్టీఆర్ భవనే
By: Tupaki Desk | 9 Sep 2018 8:36 AM GMTఅకస్మాత్తుగా వార్తల్లో నిలిచి...సంచలన విమర్శలు చేయడంలో ముందుండే సినీనటుడు శివాజీ తాజాగా కలకలం రేపే కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ గరుడ రూపు మార్చుకుందని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ శివాజి వెల్లడించారు. తనకు ప్రాణహాని ఉందని హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పటికే రెండు సార్లు....' అంటూ కీలక అంశాన్ని అస్పష్టంగా ముగించి.. మీడియా లేకపోతే తాను ఎప్పుడో చనిపోయేవాడని తెలిపారు. ప్రాణాలు పోతాయనే భయం తనకు లేదని... రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మొన్నటి వరకు పీడీ అకౌంట్ల పేరుతో బీజేపీ గోల గోల చేసి - ప్రజలను మాయలో పడేసి... ఇప్పుడు మరో విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడికి యత్నిస్తోందని ఆరోపించారు.అయితే, ఇందులో నిజం లేదని తేలింది. నటుడు శివాజీ - సీఎం చంద్రబాబుపై బీజేపీ ఘాటు విమర్శలు చేసింది.
విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఏపీ అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా ఎత్తుగడల్లో భాగమే శివాజి విమర్శలని మండిపడ్డారు. ఆపరేషన్ గరుడ అనేది బీజేపీపై తప్పుడు ప్రచారం చేసేందుకు ఎత్తుకున్న విషయమని, అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా తయారు చేసిందని ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలకు వెన్నుపోటు పొడిచేలా పెట్టుకున్న టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై ప్రజల దృష్టిని మరల్చేందుకే శివాజీతో చంద్రబాబు ఆపరేషన్ గరుడ అంటూ మాట్లాడిస్తున్నారని విమర్శించారు. మతి భ్రమించిన శివాజీ - బాబు డైరెక్షన్ లో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు నెలల క్రితం శివాజీ ఇదే ఆపరేషన్ గరుడ గురించి మాట్లాడారు..అందులో ఏ ఒక్కటైనా నిజమైందా అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన తెలుగుదేశం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని చంద్రబాబు సమర్థించుకోవడం దురదృష్టకరమన్నారు.
రెండు నాల్కల దోరణిలో మాట్లాడటానికి చంద్రబాబు సుపరిచితమైన చిరునామ అని కోట సాయికృష్ణ ఎద్దేవా చేశారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిదన్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ఆయన సూటిగా ప్రశ్నించారు. గతంలో సోనియా గాంధీని దెయ్యం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే సోనియా గాంధీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఈ విషయమై టీడీపీ శ్రేణులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. .కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. టీడీపీ కాంగ్రెస్ పొత్తు అపవిత్రమైందనే విషయం తెలుగుదేశం నేతలకు కూడా తెలుసని ఆయన పేర్కొన్నారు.