Begin typing your search above and press return to search.
వేట ప్రారంభించిన బీజేపీ ?
By: Tupaki Desk | 2 Feb 2022 8:30 AM GMTముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణా బీజేపీ గట్టి అభ్యర్థుల వేట మొదలు పెట్టిందా ? పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణలో షెడ్యూల్ ఎన్నికలకు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు సమయముంది. అయితే ఈ ఏడాది డిసెంబర్లోగానే ఎన్నికలు వచ్చే అవకాశముందని కమలనాథులు అనుమానిస్తున్నారు. కేసీయార్ ఆలోచనల ప్రకారం, చరిత్రను చూస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశముందని అనుమానిస్తున్నారు.
తొందరలోనే జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కేసీఆర్ తరపున స్పష్టమైన క్లారిటీ రావచ్చని కమలనాథులు అనుకుంటున్నారు. ఇందులో బాగంగానే పార్టీ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధుల కోసం వెతుకులాట మొదలు పెట్టారట. పార్టీ పరంగా బాగా యాక్టివ్ గా ఉన్న నేతలెవరు ? ఇతరత్రా మంచి స్తోమత కలిగిన నేతలు ఎవరు అనే విషయాలను పరిశీలిస్తున్నారు.
అలాగే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి రావాలని అనుకుంటున్న నేతల చిట్టాను కూడా పరిశీలిస్తున్నారట. ఇతర పార్టీల్లో గట్టి నేతలను బీజేపీలో చేర్చుకోవాలని బండి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో నుండి కొందరు కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కొంత సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోకపోతే ఈపాటికి చాలామంది సీనియర్స్ కమలం పార్టీ కండువా కప్పుకునేవారే.
ఇదే సమయంలో టీఆర్ఎస్ నుండి కూడా కొందరు నేతలు బీజేపీలో చేరారు. అయితే వివిధ జిల్లాల్లో గట్టి నేతలు అనుకున్నవారు ఇంకా పార్టీ మారలేదు. వీరికోసం బండి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
పార్టీ ఏ ఏ నియోజకవర్గాల్లో వీక్ గా ఉందో అలాంటి నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి నేతలను తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారికి టికెట్ల హామీ ఇచ్చైనా సరే పార్టీలో చేర్చుకునేందుకు బండి రెడీ అయ్యారట. మొత్తానికి గట్టి నేతలు, అభ్యర్థుల వేటలో బండి చాలా బిజీగా ఉన్నట్లు అర్ధమవుతోంది.