Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌ల‌ను తాక‌ట్టు పెట్టి జ‌గ‌న్ అప్పులు చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   28 July 2022 5:35 AM GMT
ప్ర‌జ‌ల‌ను తాక‌ట్టు పెట్టి జ‌గ‌న్ అప్పులు చేస్తున్నారా?
X
ఏపీ ప్ర‌జ‌ల‌ను తాక‌ట్టు పెట్టి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అప్పులు చేస్తున్నారా అంటే అవున‌నే అంటున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు. జ‌గ‌న్ పాల‌నలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల కుప్ప‌గా మారింద‌ని మండిప‌డ్డారు.

ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఊరూపేరూలేని వైఎస్సార్సీపీ నేత‌లు కేంద్రాన్ని విమ‌ర్శిస్తున్నార‌ని నిప్పులు చెరిగారు. వైఎస్ జ‌గ‌న్ కు ద‌మ్ముంటే ప్రధాని న‌రేంద్ర మోడీని ప్ర‌శ్నించాల‌ని సోము వీర్రాజు స‌వాల్ విసిరారు. ప్ర‌త్యేక హోదాపై వైఎస్సార్సీపీ, టీడీపీ డ్రామాలు ఆడుతున్నాయ‌న్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో చంద్రబాబే కోరారని సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని చంద్ర‌బాబు చెప్పార‌న్నారు.

కేంద్రం ఇచ్చిన రూ. 7,798 కోట్లు తీసుకొని కేంద్రానికీ, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు లేఖ కూడా రాశారని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు తమ రాజకీయ ప్ర‌యోజ‌నాల‌ కోసం పార్లమెంట్‌లోనూ, బయటా ప్ర‌త్యేక‌ హోదా గురించి మాట్లాడ‌టం విడ్డూర‌మ‌న్నారు.

ప్రత్యేక హోదా విష‌యంలో బీజేపీని త‌ప్పుపడుతూ కొంద‌రు రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకుండా కొందరు కుట్రలు చేస్తున్నార‌ని సోము వీర్రాజు ఆరోపించారు. టీడీపీ, వైఎస్సార్సీపీ వంద శాతం ఆత్మీయ కౌగిలిలో ఉన్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ, వైఎస్సార్సీపీల‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు బీజేపీకి అవకాశం ఉందన్నారు. జనసేనతో కలసి మిత్రపక్షంగా బీజేపీ ముందుకు సాగుతుంద‌ని వివ‌రించారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు రెండేళ్లు పూర్తి చేసుకున్నారు.