Begin typing your search above and press return to search.

ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉరుకొం : సోము వీర్రాజు

By:  Tupaki Desk   |   21 Sep 2020 2:00 PM GMT
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉరుకొం : సోము వీర్రాజు
X
ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద దుమారం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల, హిందూ సంఘాల నిరసనలతో హోరెత్తిస్తున్నారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ నేడు తిరుమల అలిపిరి పాదాల వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో కూడా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని తప్పు పడుతున్నారు. తిరుమల తిరుపతి సంరక్షణ సమితి, విశ్వహిందూ పరిషత్, బిజెపి నేతలు నేడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.

ఆంజనేయ స్వామి బొమ్మ చెయ్యి విరిగితే ఏమవుతుంది అంటూ కొడాలి నాని విగ్రహాన్ని బొమ్మ అని పేర్కొని ఆంజనేయస్వామిని అవమానపరిచారని వారు మండిపడ్డారు. రాజకీయాలు చేస్తున్న మంత్రి కొడాలి నాని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ తేల్చి చెప్పారు. కొడాలి నాని వ్యాఖ్యలపై విశాఖ డాబాగార్డెన్స్ జంక్షన్ లో విశ్వహిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు నేడు నిరసన చేపట్టారు. హిందూ మతాన్ని, హిందూ దేవాలయాలను, వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి ఫోటోను కాళ్లతో తొక్కి నిరసన తెలియజేశారు.

మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. మంత్రి వాడిన భాష చాలా అభ్యంతరకరమని, దేవుడి పట్ల ఆ భాష సభ్యత కాదని మండిపడ్డారు. చేతికి, మెడలో రుద్రాక్షలు వేసుకున్న మంత్రి నానీ ఏం మాట్లాడుతున్నారో అర్ధం అవుతుందా అంటూ ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. హిందూ దేవాలయాలపైన, దేవుళ్ళపైన, ధర్మంపైన నోటికొచ్చినట్టు నాని మాట్లాడుతున్నారని , ఆంజనేయ స్వామి పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అన్ని ఆంజనేయస్వామి దేవాలయాలలో స్వామివారికి వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే , మంత్రి నాని పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సైతం టీడీపీ హయాంలో హిందూ దేవాలయాలను కూల్చి వేశారని, పుష్కరాల సమయంలో 30 మంది మృతి కారణమయ్యారని సోము వీర్రాజు మండిపడ్డారు.