Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ లో బీజేపీ వ్యూహమేంటి?
By: Tupaki Desk | 15 Aug 2021 4:30 PM GMTహుజూరాబాద్ లో ఉప ఎన్నిక వేడి తీవ్ర స్థాయికి చేరింది. ఇక్కడి నియోజకవర్గ గెలుపు కోసం అధికార పార్టీ చెమటోడ్జి పనిచేస్తుండగా అంతే స్థాయిలో ప్రతిపక్షాలు కూడా దూకుడు పెంచాయి. ముఖ్యంగా బీజేపీ తరుపున పాదయాత్ర చేపట్టిన ఈటల రాజేందర్ గెలుపే లక్ష్యంగా కష్టపడుతున్నాడు. మొన్నటి వరకు ఊరూరా తిరిగుతూ పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం ఇక్కడ గెలిచేందుకు కోట్లు కుమ్మరిస్తోందని, అయితే తాను ప్రజల మనసును దోచుకొకుంటానని ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమంతో ఈటల వార్తల్లో నిలుస్తున్నారు. అటు బీజేపీ అధిష్టానం సైతం ఈ ఉప ఎన్నిక గెలిచేందుకు సవాల్ గా తీసుకుంది.
ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ శ్రేణులు. ఇప్పటికే ఆయన పాదయాత్ర మొదలు కావాల్సి ఉంది. అయితే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇది వాయిదా పడింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ పాదయాత్ర ముగిసిపోవాలని ప్లాన్ చేస్తున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుంచి హుజూరాబాద్ వరకు ఈ పాదయాత్రను కొనసాగించేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఈనెల 24న ఆ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయంటున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఆరు సార్లు గెలిచారు ఈటల రాజేందర్. ఈసారీ గెలిచేరందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. ప్రభుత్వం దళిత బంధు పేరిట ప్రవేశపెట్టిన పథకాన్ని అందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకానికి తాను వ్యతిరేకం కాదని ఇదివరకే చెప్పిన ఈటల ప్రతీ ఒక్కరికి దళిత బంధు అందించాలని కోరుతున్నారు. అయితే శుక్రవారం దళిత బంధు 15 మందికి మాత్రమే పంపిణీ చేస్తామన్న వార్త బయటికి రావడంతో మిగతా దళితుల్లో ఆందోళన వ్యక్తమైంది. కొందరు రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమకు కూడా దళిత బంధు అందించాలని ఆందోళన చేస్తున్నారు.
ఈ తరుణంలో దళిత బంధు అందరికీ అందించేలా దీక్ష చేపడుతానని ఈటల ప్రకటించడం విశేషం. ఇక కొందరు దళితులు ఈటల రాజేందర్ తోనే దళిత బంధు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. దీనిని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. అందుకే దళిత బంధుపై ఎక్కువగా మట్లాడడం లేదు. ఉప ఎన్నిక కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో అధికార పార్టీకి లాభమేనంటున్నారు. దీంతో విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లొచ్చనే ఆలోచనతో ఉన్నారు.
ఇందులో భాగంగా నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న హరీశ్ రావు ఇక్కడే మకాం వేశారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలో ఉత్సాహం నింపుతూ ప్రజలను నేరుగా కలుస్తున్నారు. ప్రభుత్వం పథకాలు అందరికీ అందుతున్నాయా..? అని అడుగుతున్నారు. ఇక కల్యాణ్ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లాంటి చెక్కులు అప్పటికప్పుడే అందిస్తున్నారు. మరోవైపు మిగతా మంత్రులు కూడా తమకు అప్పగించిన మండలాల్లో పర్యటిస్తున్నారు.
దీంతో బీజేపీ సైతం దూకుడు పెంచాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే బీజేపీ నుంచి చాలా మంది టీఆర్ఎస్లోకి వలస వెళ్లారు. మరింత మంది బీజేపీని వీడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ది కూడా ఇదే జిల్లా కావడంతో ఇక్కడి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా నియోజకవర్గాన్ని చేజారనివ్వకుండా చూడాలని వ్యూహాలు రచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలతో ప్రచారం చేస్తూ వాటిని అమలు చేస్తామని అంటున్నారు. ఈనెల 16న కేసీఆర్ హుజూరాబాద్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన నియోజకవర్గ ప్రజల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంత బీజేపీ తరుపున విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరవ్వాలని కమలం క్యాడర్ ప్లాన్ వేస్తోంది.