Begin typing your search above and press return to search.

ఒక వ్యూహం..రెండు ల‌క్ష్యాలు..బీజేపీ క‌ల నెర‌వేరుతుందా..!

By:  Tupaki Desk   |   7 July 2019 11:02 AM GMT
ఒక వ్యూహం..రెండు ల‌క్ష్యాలు..బీజేపీ క‌ల నెర‌వేరుతుందా..!
X
కేంద్రం లోని బీజేపీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంది. దేశ పాల‌నను ఆర్థికంగా ప‌రుగు లు పెట్టించ‌డంతో పాటు.. దేశం మొత్తం హిందూత్వ వ్యూహాన్ని అమ‌లు చేయాలి. ఇప్ప‌టికే ఉత్త‌రాదిలో ఓకే అనిపించుకున్న క‌మ‌ల నాథులు.. ద‌క్షిణాదిని టార్గెట్‌ గా చేసుకుని ముందుకు సాగుతున్నారు ఈ వ్యూహంతోనే బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాది రాష్ట్రాల్లో క‌ర్ణాట‌క మాత్ర‌మే బీజేపీకి అనుకూలంగా ఉంది. త‌మిళ‌నాడులో పావులు క‌ద‌పా ల‌ని భావించినా.. అక్క‌డ బ‌లమైన ప్రాంతీయ వాదం - స్థానిక త‌త్వం.. పూర్తిగా అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడులో మాత్రం బీజేపీకి సానుకూల ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు.

దీంతో ఏపీ - తెలంగాణ‌ - కేర‌ళ‌ ల‌పై కేంద్రంలోని క‌మ‌ల నాథులు దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కేరళలో అయ్య‌ప్ప‌స్వామి టెంపుల్‌ లోకి మ‌హిళ‌ల ప్ర‌వేశంపై యాగీ చేయ‌డం ద్వారా కేర‌ళ‌లో పావులు క‌దిపాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే, ఇది కూడా సాధ్యం కాని ప్ర‌యోగంగా మారిపోయిన నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌లో అధికారపు అంచుల వ‌ర‌కు చేరుకున్న బీజేపీ.. కేవ‌లం న‌లుగురు స‌భ్యుల కొర‌వ కార‌ణంగా అధికార పీఠానికి దూర‌మైంది. దీంతో ఇప్పుడు సాధ్య‌మైనంత వ‌రకు కూడా పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఎక్క‌డ ఏ రాష్ట్రంలో ఎలాంటి వీలు చిక్కినా వినియోగించుకునేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో ఏపీ - తెలంగాణ‌ల్లోనూ ప‌క్కాగా పావులు క‌ద‌పాల‌ని - వ‌చ్చే ఐదేళ్ల‌లో అధికారంలోకి రావాల‌ని కూడా బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా స‌భ్యత్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. అదే స‌మ‌యంలో పార్టీల నుంచి వ‌చ్చే వారికి స్వాగ‌త స‌త్కారాలు చేయాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఐదారు మాసాల్లోనే పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం - ఏపీ - తెలంగాణ‌ల్లో ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గ‌డం అనే రెండు ల‌క్ష్యాల దిశ‌గా బీజేపీ నాయకులు క‌దులుతున్నార‌ని తెలుస్తోంది. నిజానికి ఏపీలోను - తెలంగాణ‌లోనూ ఏర్ప‌డిన రెండు ప్ర‌భుత్వాలు కూడా విభ‌జ‌న క‌ష్టాలు - న‌ష్టాల్లో తీవ్రంగా మ‌ద‌న ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ వీక్‌ నెస్‌ ను అడ్డు పెట్టుకుని ఏపీ - తెలంగాణ‌ల్లో ఎదిగేందుకు క‌మ‌ల నాథులు భారీ క‌స‌ర‌త్తే చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.