Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు బీజేపీకి బలమొచ్చింది..!

By:  Tupaki Desk   |   17 Oct 2019 8:02 AM GMT
ఎట్టకేలకు బీజేపీకి బలమొచ్చింది..!
X
కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి కొరకరాని కొయ్యగా రాజ్యసభ తయారైంది. అంతకుముందు విజయం చవిచూడకపోవడం.. రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో రాజ్యసభలో కాంగ్రెస్ వృద్ధ పిండాలతో నిండిపోయింది. దీంతో లోక్ సభలో బిల్లులు పాస్ అయినా రాజ్యసభలో పాస్ కాక మోడీ తొలి కేబినెట్ లో ఎటువంటి సాహస నిర్ణయాలు తీసుకోలేదు..

కానీ రెండోసారి గద్దెనెక్కాక పరిస్థితి మారింది. మోడీ అఖండ మెజార్టీ సాధించడం.. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తికావడంతో బలం లేని కాంగ్రెస్ ఆ స్థానాలను తిరిగి దక్కించుకోలేకపోయింది. మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ కాంగ్రెస్ సీట్లను చేజిక్కించుకుంది. ఇక టీడీపీ నలుగురు రాజ్యసభ సభ్యులు ఇతర పార్టీల రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరిపోవడంతో బీజేపీకి ఎట్టకేలకు రాజ్యసభలో బలం వచ్చింది.

టీడీపీ నలుగురు ఎంపీల బలంతో బీజేపీకి కొంత బలం పెరిగింది. ప్రస్తుతం రాజ్యసభలో బలాబలాల ప్రకారం నామినేటెడ్ ఎంపీలు పోను.. 243 మంది మొత్తం ఎంపీల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 106మంది ఎంపీల బలం వచ్చింది. అన్నాడీఎంకేకు 11 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. వీరు బీజేపీకి మిత్రపక్షమే..

ఈ లెక్కన బీజేపీకి పూర్తి మెజారిటీకి దగ్గరగా వచ్చేసింది. మిత్రపక్షాలతో లీడ్ రోల్ లో ఉంది. ఇక కాంగ్రెస్ కు రాజ్యసభలో ఎంపీల సంఖ్య తగ్గిపోయింది. కేవలం 45 మందికే పరిమితమైంది.