Begin typing your search above and press return to search.
సమ్మెలోకి బీజేపీ ఎంట్రీ.. సారుకు షాకులేనా?
By: Tupaki Desk | 12 Oct 2019 5:00 AM GMTగడిచిన వారం రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె.. మరోస్థాయిలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. ఇంతకాలం సమ్మెకు సంబంధించిన తన స్టాండ్ ను చెప్పిన బీజేపీ.. ఈ రోజు (శనివారం) నుంచి సమ్మె బరిలోకి ప్రత్యక్షంగా దిగాలని డిసైడ్ అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీన్లోకి బీజేపీ వస్తే సమ్మెకు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్న వేళ.. అందుకు తగ్గట్లే ఆ పార్టీ సైతం సమ్మెకు అనుకూలంగా రోడ్ల మీదకు వస్తోంది.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్వయంగా రోడ్డు మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాను బస్ భవన్ దగ్గర నిర్వహించే ధర్నాలో పాల్గొంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ ను కట్టడి చేయటానికి కేంద్రమే రంగంలోకి దిగాలని భావిస్తున్న వేళ.. అందుకు తగ్గట్లే తాజా సమ్మెలో బీజేపీ బరిలోకి దిగటం అంటే.. అందుకు కేంద్రం ఆశీస్సులు ఉంటాయన్నది మర్చిపోకూడదని చెబుతున్నారు.
ఇప్పటివరకూ సమ్మెకు అనుకూలంగా నిరసన.. ధర్నాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేసినంత తేలిగ్గా బీజేపీని కట్టడి చేయటం ఇబ్బందేనని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోర్కెల సాధనకు తాము కట్టుబడి ఉన్నట్లుగా లక్ష్మణ్ చెబుతున్నారు. తొలివిడతలో రంగారెడ్డి.. హైదరాబాద్.. మేడ్చల్ జిల్లాల్లోని 31 బస్ డిపోల ఎదుట తాము ధర్నాలు చేపడతామని లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఇప్పటివరకే విపక్షాలు సమ్మెకు మద్దతు ఇస్తూ.. రోడ్ల మీదకు వచ్చినా.. బీజేపీ ఎంట్రీతో పరిణామాలు వేగంగా మార్పులు చోటు చేసుకునే వీలుందని చెబుతున్నారు. మిగిలిన వారి విషయంలో ప్రదర్శించినంత దూకుడు బీజేపీతో చేయలేరంటున్నారు. ఏమైనా.. సమ్మెకు మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో నిరసన సెగ ముఖ్యమంత్రికి మరింత పెరగటం ఖాయమంటున్నారు. మరోవైపు..సమయం చూసుకొని ఈ అంశం మీద గవర్నర్ స్పందిస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెలోకి బీజేపీ ప్రత్యక్షంగా ఎంట్రీ ఇవ్వటం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటుందని చెప్పక తప్పదు.