Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిపై బీజేపీ సంచలన నిర్ణయం?

By:  Tupaki Desk   |   12 Jan 2020 6:40 AM GMT
ఏపీ రాజధానిపై బీజేపీ సంచలన నిర్ణయం?
X
ఏపీకి 3 రాజధానులు అవసరం అంటూ సీఎం జగన్ ప్రకటించేశారు. ప్రతిపక్ష టీడీపీ దీన్ని వ్యతిరేకించింది. జనసేనాని పవన్ కూడా టీడీపీ బాటలోనే నడిచి మార్చొద్దన్నారు. ఇప్పుడు సంబంధం లేదంటున్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం దీనిపై ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.

రాష్ట్ర బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం అమరావతి తరలింపును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే మౌనదీక్ష చేశారు. అయితే బీజేపీ ఎంపీ జీవిఎల్ మాత్రం రాజధాని మార్పును రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని దీనిపై కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. ఇక బీజేపీ ఉత్తరాంధ్ర సీమ నేతలు మూడు రాజధానులకు జైకొట్టారు. ఇలా బీజేపీ వైఖరి ఏంటనేది ఇప్పటివరకూ అధికారికంగా బయటపడలేదు.

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో గుంటూరులో బీజేపీ కోర్ కమిటీ భేటి అయ్యింది. బీజేపీ దిగ్గజ నేతలు సుజనాచౌదరి - సీఎం రమేశ్ - పురంధేశ్వరి - జీవీఎల్ నరసింహరావు - రాష్ట్ర పార్టీ ఇన్ చార్జీ సునీల్ దేవధర్ లు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో అమరావతిపై స్పష్టమైన నిర్నయాన్ని బీజేపీ తీసుకుంది. అమరావతి రైతులకు అండగా నిలబడాలని ఏపీ బీజేపీ తీర్మానించింది. మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమని కుండబద్దలు కొట్టింది. సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకు బీజేపీ రెడీ అయ్యింది. దీన్ని ఇక సీఎం జగన్ తీసుకున్నమూడు రాజధానుల నిర్ణయానికి పూర్తి వ్యతిరేకమని బీజేపీ క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.