Begin typing your search above and press return to search.
బీజేపీ బలపడడానికి ఆయుధమిదే..
By: Tupaki Desk | 3 Jun 2019 9:48 AM GMTకేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణులు సమరోత్సాహంగా ఊగిపోతున్నారు. తెలంగాణలోనూ అంతే.. అయితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తాము ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ఏవీ చెప్పలేదు. చేసిన మార్పులను ప్రస్తావించలేదు.. కేవలం జాతీయ వాదాన్ని మాత్రమే నమ్ముకుంది. పాకిస్తాన్ పై దాడులు.. దేశంలో హిందూ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చి గెలిచిందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు.
చేసిన అభివృద్ధి కంటే విధ్వేశాలు రెచ్చగొట్టే బీజేపీ లాభపడిందన్న వాదనకు బలం చేకూరేలా తాజాగా తెలంగాణ బీజేపీ నాయకులు వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్ వ్యాఖ్యానించిన మాటలే బలాన్ని చేకూరుస్తున్నాయి.
లక్ష్మన్ మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ అధికారంలోకి రాకముందే సెప్టెంబర్ 17 తెలంగాణ అవతరణ దినోత్సవంపై చాలా లొల్లి చేసిందని.. అధికారంలోకి వచ్చాక మాత్రం మజ్లిస్ తో కలిసి ఆ సంగతే మరిచిపోయిందన్నారు. అందుకే ఇప్పుడు మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గి కేసీఆర్ విడిచిపెట్టిన సెప్టెంబర్ 17ను తాము నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు.
దీన్ని బట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ క్యాష్ చేసుకోవడానికి ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. విమోచన దినాన్ని తెరమీదకు తీసుకొచ్చి రాష్ట్రంలో రాజకీయం చేయడానికి కావాల్సిన పునాదులను బీజేపీ వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో జాతీయ వాదం పేరిట రాజకీయం చేసి లాభపడిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలోనూ అదేప్లాన్ చేస్తోంది.కానీ కేసీఆర్ ను మించి ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ వల్ల అవుతుందా.? విమోచన దినం బీజేపీకి ప్లస్ అవుతుందా లేదా అనేది వేచిచూద్దాం..