Begin typing your search above and press return to search.
పాతబస్తీని టార్గెట్ చేసిన బీజేపీ.. ఎంఐఎంను కొట్టడం సాధ్యమేనా?
By: Tupaki Desk | 29 March 2022 1:30 PM GMTపాతబస్తీ.. అది ఎంఐఎంకు కంచుకోట.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఉమ్మడి ఏపీలో కలిసినప్పటి నుంచి అదొక సపరేట్ అస్తిత్వంతో ముందుకెళుతోంది. ఎంఐఎం పార్టీ అక్కడ పాగా వేసి ప్రతీసారి గెలుస్తూ వేరే పార్టీని కనీసం పోటీచేయడానికి కూడా సాహసించలేని విధంగా ఎదుగుతోంది. కేంద్రంలో రెండు సార్లు బీజేపీ వచ్చాక ఎంఐఎం కూడా తీరు మార్చుకుంది. దేశవ్యాప్తంగా విస్తరించింది. తమ వర్గం కోసం.. తమ జనాభా ఎక్కువ ఉన్న చోటు అల్లా అసదుద్దీన్ ఓవైసీ వెళ్లి పార్టీ తరుఫున నాయకులను నిలబెడుతున్నారు. పార్టీని విస్తరిస్తున్నారు.
ఇటీవల యూపీ ఎన్నికల్లోనూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భారీగానే ప్రచారం చేశారు. యోగిని సీఎం కానివ్వను అని శపథం చేశారు. అసద్ పై కొందరు దుండగులు ఎన్నికల ప్రచారం వేళ హత్యాయత్నం కూడా చేశారు. యూపీలో ఓడిపోయిన ఎంఐఎం పార్టీపై బీజేపీ ఫుల్ ఫోకస్ చేసింది. దాని అడ్డా అయిన పాతబస్తీని టార్గెట్ చేసింది.
తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చిపోయాడు. బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీ గల్లీ గల్లీని 15 నిమిషాల్లో జల్లెడ పడుతామని హెచ్చరించారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయడం లేదని.. అక్కడ 1000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.
15 నిమిషాలు టైమ్ ఇస్తే హిందువులను నరికి చంపుతామని ఎంఐఎం నాయకులు అంటున్నారని.. నేను చెబుతున్నా ఓవైసీ, కేసీఆర్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నిమిషాలు విద్యుత్ సిబ్బందికి పాతబస్తీని అప్పజెప్పుతాం.. పాతబస్తీ గల్లీ గల్లీలను జల్లెడ పట్టి విద్యుత్ బకాయిలను వడ్డీతో సహా వసూలు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో కరెంట్ చార్జీలను పెంచడంపై బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలలో అత్యధిక శాతం పాతబస్తీలోనే ఉన్నట్టు బండి సంజయ్ ఆరోపించారు. అక్కడికి వెళ్లి విద్యుత్ బకాయిలను వసూలు చేయడం లేదని తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే పాతబస్తీని జల్లెడ పడుతామని బండి సంజయ్ తేల్చిచెబుతున్నారు.
ఎంఐఎంకు హైదరాబాద్ లోని పాతబస్తీనే కేంద్రం. అక్కడి నుంచే ఇది తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఆయువుపట్టుపై కొట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నట్టుగా తెలుస్తోంది.