Begin typing your search above and press return to search.
బీజేపీ కొత్త టార్గెట్...కలవరపడుతున్న ఆ పార్టీ
By: Tupaki Desk | 9 Aug 2019 1:30 AM GMTప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వేగంగా బలహీనపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగలడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల నాటి నుంచి వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి మరింత షాక్ తగలడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎలక్షన్లలో మూడు సీట్లే గెలుచుకోవడం - పంచాయతీ - జెడ్పీ ఎలక్షన్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. తర్వాత పలువురు సీనియర్ నేతలు అటు టీఆర్ ఎస్ వైపు - ఇటు బీజేపీ వైపు వెళ్లిపోవడంతో పార్టీ ఇబ్బందుల్లో పడింది. అయితే, తాజాగా మరోమారు ఆ పార్టీని బీజేపీ టార్గెట్ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ సీట్లు గెలుచుకోవడం - పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యతగా రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. అయితే రాష్ట్రంలో టీఆర్ ఎస్ సర్కారుపై నెలకొన్న వ్యతిరేకత మున్సిపల్ ఎలక్షన్లలో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావించింది. కానీ జమ్మూకాశ్మీర్ అంశం మరోసారి దెబ్బతీసిందనే ప్రచారం జరుగుతోంది. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ హైకమాండ్ వ్యతిరేకిస్తుండటంతో రాష్ట్ర నేతలెవరూ కూడా ఈ అంశంపై స్పందించడం లేదు. ఇది కేడర్లో అయోమయానికి కారణమైందని అంటున్నారు.
అయితే, కాంగ్రెస్ లో నెలకొన్న అయోమయం నేపథ్యంలో బీజేపీ టార్గెట్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ...రాష్ట్రంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారని ఎప్పుడైనా ఏదైనా జరుగొచ్చని తెలిపారు. రాష్ట్రంలో 50శాతం ఓటు బ్యాంకు తమ టార్గెట్ అని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు తమకు టచ్ లో ఉన్నారని మరోమారు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17న భారీ సభకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక గోల్కొండ కోటపై విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు.