Begin typing your search above and press return to search.
టార్గెట్ తమిళనాడు వయా చిన్నమ్మ!!
By: Tupaki Desk | 9 Jan 2017 10:32 AM GMTఒకటి సానుభూతి చూపిస్తూ దగ్గరవడం - అక్కున చేర్చుకోవడం.. లేదా దాడులు చేయిస్తూ - అధికార బలంతో లోబరచుకోవడం.. అయితే ఈ రెండు కార్యక్రమాలను ఒకేసారి అమలుపరుస్తుందట బీజేపీ! అవును 2019 పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా తమిళనాట బీజేపీ తనదైన శైలిలో పావులు కదుపుతుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానిక మీడియాల్లో కూడా ఈ మేరకు కథనాలు బలంగా వస్తున్నాయి. వాటికి తాజా పరిస్థితులు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
వివరాళ్లోకి వెళితే... తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాలు - ముఖ్యంగా అన్నాడీఎంకేలో ఇంటర్నల్ పాలిటిక్స్ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అన్నాడీఎంకేలో శశికళ చాలా కీలకంగా మారారు. ఈ రసవత్తర సమయంలో సైలెంట్ గా తమిళనాడులో తమ జెండా బలంగా ఎగరవేయాలని నిర్ణయించుకున్న బీజేపీ... తాజాగా శశికలకు సపోర్ట్ చేసినట్టు కనిపిస్తూనే, లోలోపల ఆమెని పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల పట్ల వెంకయ్యనాయుడుకు మంచి అవగాహన వుండడం, అన్నాడీఎంకె లో కొంతమంది బీజేపీ సానుభూతిపరులు వుండడంతో కమలనాథులకు ఈ విషయంలో పని మరింత సులువుగా అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
ఈ విషయంలో బీజేపీ ఎంచుకున్న మార్గాల్లో ఒకటి.. ఆర్కేనగర్ నియోజకవర్గంలో శశికళ పోటీచేయడానికి సిద్దంగా ఉన్న నేపథ్యంలో ఆమెకు పరోక్ష మద్దతు ఇచ్చేందుకు రెడీ అవడం! రెండోది...శశికల మేనళ్లుడిపై ఈడీ - తమిళనాడు మాజీ సీఎస్ రాం మోహన్ రావు ఇంట్లో ఐటీ దాడులు చేయడం. ఇవన్నీ బీజేపీ వ్యూహాల్లో భాగాలేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు! ఏది ఏమైనా... తమిళనాట బీజేపీ జెండా ఏ స్థాయిలో ఎగురుతుందో అనడానికి శశికళ నిర్ణయాలు కీలక భూమిక పోషించబోతున్నాయన్నమాట!! ఇదే క్రమంలో బీజేపీ ఎంచుకున్న రెండు మార్గాల్లో ఏదో ఒకటైనా టార్గెట్ కు సూటిగా తగలొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/