Begin typing your search above and press return to search.

ఏం కొనేటట్టు లేదు...ఏం తినేటట్టు లేదు

By:  Tupaki Desk   |   8 Sep 2018 4:30 PM GMT
ఏం కొనేటట్టు లేదు...ఏం తినేటట్టు లేదు
X
భారతదేశంలో సగటు లేదా మధ్యతరగతి ప్రజలకు పెద్దగా ఆశాలు ఉండవు....... కోట్లకు పడగలేత్తాలని కోరికలూ ఉండవు........ ప్రపంచమంత చుట్టి రావాలని.......... బ్యాంకులో లక్షలకు లక్షలు బ్యాలన్సులు కావాలని........ఊహలూ ఉండవు. సంపాదించిన దాంట్లో ఒక రూపాయి వెనకేసుకుందమన్న ఆలోచన తప్పా. కాని ఈ అవకాశం కూడ లేకుండ చేస్తోంది మోదీ ప్రభుత్వం.

ఎప్పుడైన కుటుంబంతో సినీమాకో - షికారుకో వెడదామనుకునే మధ్యతరగతి కుటుంబానికి - భారతీయ జనతా పార్టీ పుణ‌్యమా అది ఒక అధిక భారమే అవుతోంది. జీఎస్టీ పేరుతో సినీమా హాళ్లు - హోటల్స్‌ - మాల్స్ - ఇలా ఒక్క చోట కాదు అన్నింటా కూడా అధిక ధరలతో వీపు విమాన మోత మోగుతోంది. ఇక పెరిగిన పెట్రోల్ ధరలతో బండి బయటకు తీయలేని పరిస్థితి......ఇది మోది ప్రభుత్వంలో సామన్య మానవుని పరిస్థితి.

తమకు ఏదో మేలు చేస్తుందని 2014లో ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీని అంద‌లం ఎక్కించిన‌ భారతదేశ ప్రజలకు ఆ పార్టీ చుక్కలు చూపిస్తోంది. తలా తోక లేని నిర్ణయాలతో ఓ సగటు మానవుని జీవితంతో ఆడుకుంటోంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు పేద - మధ్యతరగతి జీవితాలను ఓ కుదుపు కుదిపింది. ఓట్లు రద్దుతో ఏటీఎం సెంటర్ల దగ్గర గంటలు గంటలు నిలబడింది ఒక సగటు మానవుడే కాని వారిలో ఒక్క ధనవంతుడు కూడా లేకపోవడం విస్మయం కలిగించే విషయం. ఆ తర్వాత జీఎస్టీ వడ్డనతో ప్రజలంతా కూడా అయోమయంలో పడిపోయారు. ఎన్ ఓల్డ్ టాక్స్‌ హజ్ నో టాక్స్ అన్నాడు ఒక ఆర్దిక శాస్త్రవేత్త. ప్రస్తుతం ఉన్న పన్నుకు ప్రజలు అలవాటు పడ్డారు, ఉన్న పన్ను రద్దు చేసి, మరో కొత్త పన్ను అంటూ ప్రభుత్వం జీఎస్టీతో ప్రజలపై ఆర్దిక భారాన్ని మోపడం సమంజసం కాదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ హయాంలో సామాన్య - మధ్యతరగతి ప్రజలు ఏం కొనేటట్టు గాని తినేట్టు గాని లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సామాన్య మానవుడి పరిస్థితే ఇలా ఉంటే ఇక పేదవాడి పరిస్థితి ఎమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్ లీటరుకు 85 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదీ 100 రూపాయలు వరకూ వెడుతుందని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. పెట్రోల్ పెరిగితే రవాణా కూడా పెరుగుతుందని, దాని వలన మిగత అన్నీ వస్తువుల ధరలు పెరుగుతాయని - దీంతో మొత్తం వ్యవస్థ అంతా కూడా అల్లకల్లోలం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు - ధనవంతులకు కొమ్ము కాస్తోందని. వారి కనుసన్నలలో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోదీ ప్రభుత్వానికి ఉద్వాసన తప్పదని. భారతీయ జనతా పార్టీకి ప్రజలు తమ ఓట్ల ద్వార బుద్ది చెబుతారని విపక్షాలు జోస్యం చెబుతున్నాయి.