Begin typing your search above and press return to search.
భారీ ప్రకటన చేసిన రాష్ర్ట అధ్యక్షుడు
By: Tupaki Desk | 23 Sep 2015 4:49 PM GMTరాజకీయాలకు అంటే ఏది దక్కుతుందో దాని కో్సం విశ్వప్రయత్నం చేయడం. అది దక్కనపుడు లౌక్యంగా వ్యవహరించడం అనే తీరును బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి బాగా వంటిబట్టించుకున్నట్లు ఉన్నారు. తెలుగు రాష్ర్టాల బీజేపీ అధ్యక్ష పదవుల గురించి రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ముందుగానే తన ప్రకటన చేశారు. తను ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయలేనని ప్రకటించేశారు.
బీజేపీ సంస్థాగత కమిటీ నిబంధనల ప్రకారం రాష్ట్ర అధ్యక్ష పదవిని ఒకే నాయకుడికి రెండు సార్లకు మించి ఇవ్వరు. రెండో దఫా అవకాశం దొరకడం కూడా సదరు నాయకుడు పార్టీకి కట్టుబడి ఉన్న తీరును బట్టి ఉంటుంది. కిషన్ రెడ్డి తన నిబద్దతతో పదవిని రెండో దఫా పదవిని దక్కించుకున్నారు. అయితే త్వరలో ఈ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కిషన్రెడ్డి భవిష్యత్ పై చర్చ ప్రారంభం అయింది. పార్టీ పదవిని మళ్లీ దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తారా… ఒకవేళ కాదంటే జాతీయ ప్రాధాన్యం గల పోస్టుల్లోకి వెళతారా? అనే డిబేట్లు సాగాయి. ఈ విషయంపై తాజాగా కిషన్ రెడ్డి పెదవిప్పారు. పార్టీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ప్రకటించారు.
దీంతోపాటుగా జాతీయ రాజకీయ పార్టీలో ఉన్న సంప్రదాయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. తన ప్రస్తుత పదవి వీడినా….జాతీయ పార్టీ పదవులపై తనకు ఎటువంటి ఆశ లేదని ఆయన చెప్పారు. పదవులు లేకున్నా….తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధి చాటుకున్నారు.