Begin typing your search above and press return to search.

ఉత్తరప్రదేశ్ విభజన: ఎన్ని ముక్కలంటే?

By:  Tupaki Desk   |   11 Jun 2021 2:38 PM GMT
ఉత్తరప్రదేశ్ విభజన: ఎన్ని ముక్కలంటే?
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి దేశంలో కొత్తగా తెలంగాణను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదేబాటలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ విభజనకు కేంద్రం సిద్ధమవుతోందన్న ప్రచారంసాగుతోంది. రాజకీయ కారణాలే యూపీ విభజనకు కారణం అంటున్నారు.

దేశంలోనే అదిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎవరిది అధికారం అయితే వారిదే కేంద్రంలో అధికారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు స్థానికసంస్థల ఎన్నికల్లో తేలిపోయింది.

ఈ క్రమంలోనే తాజాగా యోగి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుసుకున్నారు. దీంతో యోగిని మార్చుతారా? రాష్ట్రాన్ని విభజిస్తారా? ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

యూపీలో సీఎం మార్పు..కేబినెట్ విస్తరణ అంశాలు తెరపైకి వచ్చాయి. యూపీ రాష్ట్ర విభజనకు సీరియస్ గా పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విభజించి కొత్తగా ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపైనే యోగిని ఢిల్లీకి రప్పించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రాన్నిరెండు ముక్కలు చేసైనాసరే అక్కడ అధికారంలోకి రావాలని.. సీట్లు గెలవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోందని సమాచారం.

యూపీలోని గోరఖ్ పూర్ సహా 25 జిల్లాలను పూర్వాంచల్ లో కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా మోడీ సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో 125 అసెంబ్లీ సీట్లు ఉండే అవకాశం ఉంది.ఇక ఇప్పటికే యూపీలో పూర్వంచల్ తోపాటు బుందేల్ ఖండ్, హరిత ప్రదేశ్ రాష్ట్రాల డిమాండ్ ఉంది.దీంతో ఏం జరుగుతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది.