Begin typing your search above and press return to search.
‘ఉన్నావ్’ అత్యాచార దోషి భార్యకు బీజేపీ టికెట్!
By: Tupaki Desk | 9 April 2021 1:33 PM GMTఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేకెత్తించిందో తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగార్ ఓ యుతిని రేప్ చేసినట్టు కోర్టు నిర్ధారించింది. 2017లో ఈ దారుణం జరిగింది. కోర్టు తీర్పు అనంతరం సెంగార్ ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది.
అయితే.. త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికల్లో ఆయన భార్యకు బీజేపీ టికెట్ కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దారుణ అత్యాచార ఘటనలో భర్త దోషిగా తేలిన తర్వాత.. మళ్లీ అతని కుటుంబంలోని వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. 2016లో ఆమె జడ్పీ చైర్ పర్సన్ గా కూడా ఉండడం గమనార్హం.ఈ వ్యవహారంపై బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. సెంగార్ కుటుంబానికి టికెట్ ఇవ్వడాన్నికొందరు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. అధిష్టానం మాత్రం సమర్థించుకుంటున్నట్టు సమాచారం.
ఈ విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ స్పందిస్తూ.. భర్త తప్పు చేస్తే భార్య ఏం చేసిందని అన్నట్టు తెలుస్తోంది. ఈ టికెట్ విషయంలో సుదీర్ఘ చర్చజరిగిన తర్వాతే కేటాయించినట్టు ఎంపీ శివప్రతాప్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ నెల 15 నుంచి నాలుగు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. మే 2న ఫలితాలు రానున్నాయి. మరి, ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.