Begin typing your search above and press return to search.
సెప్టెంబర్ 17.. బీజేపీ కొత్త స్కెచ్
By: Tupaki Desk | 9 Aug 2019 4:45 AM GMTజాతీయవాదం.. ఇప్పుడు బీజేపీ అస్త్రం.. కశ్మీర్ ను రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి 70 ఏళ్ల రావణ కాష్ట్రాన్ని పరిష్కరించిన బీజేపీ సర్కారుపై దేశవ్యాప్తంగా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రతీసారి ఎత్తిచూపే కశ్మీర్ ను సంపూర్ణంగా భారత్ లో విలీనం చేసే మోడీ ఎత్తుగడకు దేశప్రజలందరూ మద్దతు పలికారు. ఈ పరిణామం దేశంలోని ప్రజల్లో దేశభక్తిని తట్టి లేపింది.
జాతీయ భావాన్ని బలంగా మార్చుకుంటున్న బీజేపీ ఇప్పుడు వచ్చే నెలలో అదే ఆయుధంతో తెలంగాణపై గురిపెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన దినం.. బీజేపీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకుంటున్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలిపిన రోజు అది. అందుకే దాన్ని క్యాష్ చేసుకోవడంతోపాటు తెలంగాణలో బలపడాలని బీజేపీ స్కెచ్ గీస్తోందట.. తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ తన ఆయుధంగా మార్చుకోవాలని యోచిస్తోందట..
ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇప్పటికే సెప్టెంబర్ 17పై వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే లక్ష్మణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి - జెండా ఎగురవేయడానికి రావాలని కోరనున్నట్టు సమాచారం.
కేంద్ర హోంమంత్రి - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే ఇక్కడి ప్రజల్లో బీజేపీపై సానుకూల వాతావరణం రావచ్చని.. అదే సమయంలో టీఆర్ ఎస్-మజ్లిస్ లకు ప్రత్యామ్మాయంగా బీజేపీ ఉందన్న భావనను కలిగించవచ్చని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరి అమిత్ షా ఈ కీలకమైన సెప్టెంబర్ 17కు వస్తే మాత్రం తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం సెప్టెంబర్ 17 కేంద్రంగా బీజేపీ అమలు చేస్తున్న ‘ఆపరేషన్ విమోచన’ స్కెచ్ ఇప్పుడు తెలంగాణలో సెగలు పుట్టిస్తోంది.