Begin typing your search above and press return to search.

కమలం ప్రధాని అభ్యర్థి మారతారా...?

By:  Tupaki Desk   |   13 July 2018 10:08 AM GMT
కమలం ప్రధాని అభ్యర్థి మారతారా...?
X
వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పధానమంత్రి అభ్యర్దిగా నరేంద్ర మోదీ కొనసాగరా..? అవుననే అంటున్నాయి బిజేపివర్గాలు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు పై బిజేపిలో సీనియర్ మంత్రులు - ఆర్‌ ఎస్ ఎస్ అగ్రనాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ దుందుండుకు వైఖరి - ఏకఛత్రాది పత్యం భాజపా సీనియర్ నాయకులకు - ఆర్‌ ఎస్‌ ఎస్ అగ్ర నేతలకు రుచించడం లేదు. ప్రధాని మంత్రి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం - జిఎస్టీలతో పాటు ప్రధాని వర్గంగా చెప్పుకుంటున్న కొందరు మంత్రులు - పార్టీ నాయకుల వైఖరి కూడా సరిగా లేదంటూ విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తే నరేంద్ర మోదీ ప్రధానిగా మళ్లి పగ్గాలు తీసుకుంటే ఆయన మరింత రెచ్చిపోతారని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

బీజేపీ - ఆర్‌ ఎస్‌ ఎస్ అంతర్గంతంగా జరిపిన సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీ పైనా - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పైనా ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో పార్టీ ప్రధాన అభ్యర్థిని తప్పనిసరిగా మార్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్లు అద్వాని - మురళీ మనోహర్ జోషి వంటి వారు ఆర్‌ ఎస్‌ ఎస్ అగ్రనాయకులతో భేటీ అయి ప్రధాని అభ్యర్ది పై చర్చించినట్టు సమాచారం. వయస్సులో పెద్దవారైన అద్వానీని ప్రధాని చేయటం పట్ల విముఖత వ్యక్తమైందని తెలిసింది. అద్వానీ కూడా తాను ప్రధన మంత్రి రేసులో ఉండనని ఆ సమావేశంలో స్పష్టం చేసినట్టు చెపుతున్నారు. నాగపూర్‌ లోని ఆర్‌ ఎస్‌ ఎస్ ప్రధాన కార్యలయంలో జరిగిన ఈ భేటీలో విశ్వహిందూ పరిషత్ - భజరంగ్ దళ్ ముఖ్యనాయకులు కూడా పాల్గొన్నట్లు చెపుతున్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన ఈ నాలుగేళ్లలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందే తప్ప అనుకూలత రావడం లేదని అభిప్రాయపడినట్లు సమాచారం.
రేసులో గడ్కరి.....రామ్‌మాధవ్...?

భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్ది రేసులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి - బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ‌్ మాధవ్ ఉన్నట్లు తెలిసింది. వీరిద్దరిలో ఏ ఒకరినైనా ప్రధానిగా నిర్ణయించాలని కీలక సమావేశంలో తీర్మానించారట. ఈ ఇద్దరికీ ఆర్‌ ఎస్ ఎస్ అండదండలుండడం - ఇద్దరూ సాత్వికులు కావడం వీరికి కలిసివచ్చే అంశం. వీరిలో గడ్కరికి కేంద్ర మంత్రిగాను - బిజేపి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. అద్వానీ వంటి నాయకుల ఆశీసులు ఉన్నాయి. ఇక రామ్‌ మాధవ్ పట్ల దక్షిణాది నాయకుడు అనే చిన్న చూపు ఉంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ వర్గంలో మనిషిగా కొందరు భావిస్తున్నారు. ఈ ప్రతికూలతల కారణంగా రామ్‌ మాధవ్ కు ప్రధాని ఛాన్స్ దక్కే అవకాశాలు తక్కువే. అయితే ఆర్‌ ఎస్ ఎస్ అగ్ర నాయకులు మాత్రం రామ్‌ మాధవ్ వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. ఏది ఏమైనా బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం నరేంద్ర‌ మోదీ రెండవసారి ప్రధాని అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.