Begin typing your search above and press return to search.
సౌత్ ఫేస్ : బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా వెంకయ్యనాయుడు...?
By: Tupaki Desk | 21 Jun 2022 1:30 PM GMTదేశానికి కొత్త రాష్ట్రపతిగా ఎం వెంకయ్యనాయుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన అభ్యర్ధిత్వాన్ని ఆమోదించడం ద్వారా దక్షిణ భారతాన్ని తమ వైపునకు తిప్పుకోవాలన్న బీజేపీ రాజకీయ ఆకాంక్ష దాగి ఉందని అంటున్నారు. ఇక వెంకయ్యనాయుడు బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధి అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీ మద్దతు లభిస్తుంది అని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా టీడీపీ, టీయారెస్, డీఎంకే వంటి పార్టీలు కచ్చితంగా వెంకయ్యనాయుడు అభ్యర్ధిత్వం పట్ల సుముఖంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఇక వెంకయ్యనాయుడు విషయం తీసుకుంటే వ్యక్తిగా ఆయన గొప్పవారు. రాజకీయ పరంగా చూసుకున్నా కూడా ఆయనది విశేష అనుభవం. అంతే కాదు, అట్టడుగు స్థాయి నుంచి వచ్చి అందలం ఎక్కిన చరిత్ర కూడా ఆయనదే.
సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగినా ఎక్కడా చిన్నపాటి మచ్చ కూడా లేని వారు ఆయన. కేంద్ర మంత్రిగా బీజేపీ జాతీయ అధ్యస్ఖునిగా పనిచేసి గత తరం, వర్తమాన తరంతో కూడా ఎంతో హుందాగా కలసిపోయే నైజం ఆయంది. అంతే కాదు ఆయన దక్షిణ భారతానికి సంబంధించి దిగ్గజ నేతగా ఉన్నారు.
వాజ్ పేయ్ అద్వానీ తరానికి చెందిన వారిగా వివాదరహితునిగా ఉన్న వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలన్నది అందరి కోరిక. అదే విధంగా వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అయితే సర్వేపల్లి రాధాక్రిష్ణన్, వీవీ గిరి, వెంకటరామన్ వంటి ఉప రాష్ట్రపతులు రాష్ట్రపతులుగా అధిరోహించిన క్రమంలో ఆ సంప్రదాయానికి ఊపిరి పోసిన వారు అవుతారు.
ఇక అబ్దుల్ కలాం దక్షిణాదికి చెందిన చివరి రాష్ట్రపతి. ఆయన తరువాత వరసగా ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాధ్ కోవింద్ ఉత్తరాదివారే. దాంతో ఈసారి చాన్స్ కచ్చితంగా వెంకయ్యనాయుడుకి ఉందని భావిస్తున్నారు.