Begin typing your search above and press return to search.
భారతీయ జనతా పార్టీ..మరింత గందర గోళంలోకి..!
By: Tupaki Desk | 3 Jan 2020 7:09 AM GMTఏపీ రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ గందరగోళ ప్రకటనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకూ రాజధాని విషయంలో బీజేపీ నేతల నుంచి తలా ఒక ప్రకటనలు వచ్చాయి. కొందరు మొదట చేసిన తమ ప్రకటనలతో ఆ తర్వాత విబేధించుకున్నారు. పేరుకు జాతీయ పార్టీ అయినప్పటికీ.. రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.
ఇప్పటి వరకూ బీజేపీ నేతలు రకరకాల ప్రకటనలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను సీఎం జగన్ మోహన్ రెడ్డి చేయగానే.. బీజేపీ మొదట స్వాగతించింది. మూడు రాజధానుల ఫార్మాలను ఏపీ బీజేపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్వాగతించారు. అయితే ఆ తర్వాత ఆయన మాట మార్చారు. అమరావతి రైతులకు మద్దతు అని ప్రకటించారు. అందులో కన్నా వ్యక్తిగత లాభం ఏదో ఉందని ప్రచారం జరుగుతూ ఉంది. తమ ప్రాంతానికి దగ్గరే రాజధాని ఉండాలని కన్నా బావిస్తు ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు.
బీజేపీ మొదటి నుంచి వికేంద్రీకరణకు అనుకూలమని కమలనాథులు చెబుతూ వచ్చారు. కర్నూలుకు హైకోర్టు దక్కాలన్నారు. అయితే కర్నూలుకు హై కోర్టును బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడే ఖండించడం గమనార్హం. అయితే ఆ ప్రాంత బీజేపీ నేతలు ఆ విషయాన్ని స్వాగతించారు. విష్ణు వర్ధన్ రెడ్డి, టీజీ వెంకటేష్ లు రాయలసీమలో హైకోర్టును స్వాగతించారు. అంతే గాక టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. కర్నూలులో మినీ అసెంబ్లీని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే బీజేపీలో గందరగోళం అంతటితో కూడా ఆగలేదు. రాజధాని విషయంలో సుజనా చౌదరి మాట్లాడుతూ.. అమరావతి నుంచి అంగుళం కదిల్చినా సహించేది లేదన్నారు. చౌదరికి అక్కడ భారీగా భూమలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. అంతలోనే బీజేపీ అధికార ప్రతినిధి కూడా అయిన జీవీఎల్ మాట్లాడుతూ.. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశమని, అదెక్కడున్నా తమకు సంబంధం లేన్నారు. సీఎం రమేశ్ కూడా అదే రీతిన స్పందించారు. రాజధాని ఎక్కడ? అనే అంశంతో కేంద్రానికి సంబంధం లేదన్నారు.
ఇలా ఎవరికి తోచింది వాళ్లు చెబుతూ ఉన్నారు. ఈ విషయంలో బీజేపీ ముందు ఏకాభిప్రాయం తెచ్చుకోవాల్సి ఉంది. బహుశా ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఈ విషయంలో ఏమైనా స్పష్టత ఇస్తుందమో తమ విధానం గురించి!