Begin typing your search above and press return to search.

ఢిల్లీలో.. బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ ఫ్లెక్సీల ర‌గ‌డ‌

By:  Tupaki Desk   |   11 April 2022 9:31 AM GMT
ఢిల్లీలో.. బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ ఫ్లెక్సీల ర‌గ‌డ‌
X
తెలంగాణ‌లో నువ్వెంతంటే.. నువ్వెంత‌న్న‌ట్టుగా రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీ-టీఆర్ ఎస్‌లు.. గ‌ల్లీలోనే కాదు.. ఢిల్లీలోనూ ఇదే త‌ర‌హా రాజకీయాలు చేస్తున్నాయి. క‌నీసం.. దేశ‌రాజ‌ధానిలో అయినా.. జాగ్ర‌త్త‌గా ఉందామ‌నే ధ్యాస మ‌రిచిపోయిన‌ట్టుగా ఈ పార్టీల కార్య‌క‌ర్త‌లు ప్ర‌వ‌ర్థిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా ఢిల్లీ వేదిక‌గా.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్య‌మానికి పిలుపు చ్చారు. సాధార‌ణంగా.. ఎక్క‌డ రాజ‌కీయ నేత‌లు కార్య‌క్ర‌మాలు చేసినా.. ఫ్లెక్సీలుక‌ట్టుకోవ‌డం ఆన‌వాయితీ. ఎవ‌రి ప్ర‌చారం వారిది. అయితే.. దీనికి ప్ర‌తిగా.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. బండి సంజ‌య్ పేరుతోనూ.. అక్క‌డే ఫ్లెక్సీలు వెలిశాయి.

ఇలా..దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్‌, బీజేపీ నేతలు పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌ దగ్గర తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పేరుతో బీజేపీ ఫ్లెక్సీలు వెలిశాయి. గల్లీ రాజకీయాలు ఢిల్లీలో చేస్తావా.. రైతుల పేరుతో నాటకాలు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

చేతనైతే ధాన్యం కొను.. లేదంటే గద్దె దిగు పేరుతో బీజేపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. మరోవైపు దీక్ష పేరుతో టీఆర్ఎస్‌ నేతలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 3 భాషల్లో బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా బీజేపీ ఫ్లెక్సీలను టీఆర్ఎస్‌ కార్యకర్తలు చించివేస్తున్నారు.

ఈ విష‌యం తెలియ‌డంతో.. బీజేపీ కార్య‌క‌ర్త‌లు కూడా రంగంలోకి దిగారు. ఢిల్లీలోని బీజేపీ కార్య‌క‌ర్త‌లు.. కేసీఆర్ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీల‌ను చింపే ప్ర‌య‌త్నం చేయ‌గా.. తెలంగాణ భ‌వ‌న్ సిబ్బంది వారిని వెంబ‌డించి మ‌రీ.. అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ నేత‌లు.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది.

మొత్త‌గా ఈ విష‌యం.. మీడియాకు ఎక్క‌డంతో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ వివాదం.. ఫ్లెక్సీల‌ను చింపుకునే వ‌ర‌కు వ‌చ్చింద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌రోవైపు.. బీజేపీ ఫ్లెక్సీల‌నుఎందుకు తొల‌గిస్తున్నారంటూ.. బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు. బీజేపీ కి ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేసుకునే హ‌క్కులేదా? అని నిల‌దీశారు. మ‌రి ఈ వివాదం ఎలా మారుతుందో చూడాలి.