Begin typing your search above and press return to search.
వైసీపీపై బీజేపీ ప్రేమ.. ప్లాన్ వర్కవుట్ అవుతోందా?
By: Tupaki Desk | 17 Dec 2019 8:07 AM GMTబీజేపీకి మిత్రులు దూరమైపోతున్నారు. శివసేన గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ తర్వాత ప్రతిపక్షంలో అత్యధిక సీట్లు కలిగింది వైసీపీనే. ఇక యువ సీఎంగా జగన్ తన పథకాలు పాలనతో ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారు. ఈ పరిణామమే వైసీపీపై బీజేపీ నాయకత్వానికి ప్రేమ కలుగుతోందట.. త్వరలోనే వైసీపీని ఎన్డీఏలో చేర్చుకోవడానికి బీజేపీ ప్లాన్ సిద్ధం చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎన్డీఏ నుంచి శివసేన నిష్క్రమణ తర్వాత ఏర్పడ్డ ఖాళీని వైసీపీతో భర్తీ చేయడానికి ప్లాన్ చేస్తోందట.. అందుకే వైసీపీ ఎంపీలు - ఎమ్మెల్యేలు చేస్తున్న సూచనలకు కేంద్రం - పీఎంవో చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం ఈ మధ్య ఢిల్లీలో పెరిగిపోయిందట..
లోక్ సభలో ఏకంగా 22మంది ఎంపీలతో మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ ఉంది. రాజ్యసభలో ఇద్దరు ఎంపీలున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వైసీపీ 151 ఎమ్మెల్యేల బలంతో నలుగురు రాజ్యసభ సభ్యులను గెలిపించుకొని ఆ సంఖ్యను ఆరు కు పెంచుకుంటుంది. ఇది బీజేపీకి ఆశ పుట్టిస్తోంది. రాజ్యసభలో తగినంత బలం లేకుండా బిల్లులు పాస్ చేయించడంలో ఆపసోపాలు పడుతున్న బీజేపీకి వైసీపీని చేర్చుకుంటే బలం చేకూరుతుందని భావిస్తోందట.
ఇక వైసీపీ కనుక ఎన్డీఏలో చేరితే వారికిచ్చే పదవులపై కూడా బీజేపీ అధిష్టానం ఓ క్లారిటీతో ఉందనే టాక్ వినిపిస్తోంది. అమలాపురం దళిత ఎంపీ చింతా అనురాధను లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా చేస్తారని తెలుస్తోంది. ఇక వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని మోడీ కేబినెట్ లో మంత్రిని చేయవచ్చని ఉన్నత స్థాయి వర్గాలు అంటున్నాయి. కానీ ఇదంతా జరగాలంటే మొదట సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్టీఏలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.