Begin typing your search above and press return to search.
బీజేపీకి అతిపెద్ద గండం తప్పనుంది
By: Tupaki Desk | 19 Jan 2016 7:54 AM GMTకేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు ఆ పార్టీకి పంటికింద రాయిలా మారిన సమస్యకు పరిష్కారం దొరకనుంది. బెట్టుతో అయినా గెలిపించుకోవాలన్న బిల్లులను ఆఖరికి కాంగ్రెస్ ను అభ్యర్థించి అయినా వాటిని ఒడ్డున పడేసుకుందామని చూసినా ఫలితం వృదా అయిన నేపథ్యంలో కాలం ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వనుంది.
మోడీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన భూసేకరణ బిల్లు మొదలు, జీఎస్ టీ బిల్లు - కార్మిక చట్టాల సవరణ వంటివన్నీ రాజ్యసభలో తీవ్ర ఒడిదుడుకలను ఎదుర్కోవడమే కాకుండా ఇప్పటికీ సభలో నెగ్గలేదు. మొత్తంగా రాజ్యసభ అంటే బీజేపీ పెద్దలు కొరకరాయి కొయ్యగా భావిస్తున్న సమయంలో ఓ శుభవార్త వెలువడింది. రాజ్యసభలో 74 మంది ఎంపీల పదవీకాలం త్వరలో ముగియనుంది. అంతే కాదు ఇందులో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కంటే బీజేపీకే దక్కే అవకాశం ఉంది.
245 మంది సభ్యులు గల ఎగువ సభలో కాంగ్రెస్ బలం అధికంగా ఉండగా, త్వరలో 74 మంది ఎంపీల పదవీకాలం ముగియనుంది. బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీల బలం రాజ్యసభలో ప్రస్తుతం 63 ఉండగా, మరో ఏడు సీట్లు రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి దక్కే అవకాశముంది. దీంతో ఎగువసభలో ఎన్ డీఎ గుప్లిట్లో మొత్తం 70 సీట్లు ఉంటాయి. దీనికితోడు ఐదుగురు నామినేటెడ్ ఎంపీలు - మాజీ కేంద్ర మంత్రి - కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ లకు ఈ ఏడాదిలోనే పదవీకాలం ముగియనుంది. సాధారణంగా నామినేటెడ్ విభాగాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం తమకు నచ్చిన, సమర్థులని భావించిన నేతలను ఎంపిక చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ బలం మరింత పెరుగుతుంది.
కాంగ్రెస్ విషయానికొస్తే గత ఎన్నికల్లో రాజస్థాన్ - హర్యానా - మహారాష్ట్ర - ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ - జార్కండ్ లలో పరాజయం పాలైన ఫలితంగా 20 సీట్లలో కనీసం 6 సీట్లను కోల్పోనుంది. దీంతో ఎగువసభలో ఇప్పటి వరకూ ఉన్న కాంగ్రెస్ బలం 67 సీట్ల నుండి 61 సీట్లకు పడిపోనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే బీజేపీ-టీడీపీలు మొత్తంగా నాలుగు సీట్లను కలిగివున్నాయి. వీరిలో వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ ఏడాదితో పదవీకాలం ముగియనుంది. అలాగే మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ కు కూడా ఈ ఏడాదితోనే పదవీకాలం ముగియనుంది. అయితే ఆయనను పార్టీ రాజ్యసభకు మరోసారి ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.