Begin typing your search above and press return to search.
వాడకంలో బీజేపీ : వైసీపీ టీడీపీలను తెలంగాణాలో కూడా...?
By: Tupaki Desk | 13 Aug 2022 2:30 PM GMTఏపీలో రెండు కీలక పార్టీలు ఉన్నాయి. అవే ఒకటి అధికార వైసీపీ, మరొకటి ప్రతిపక్ష టీడీపీ. ఈ రెండు పార్టీలను ఎడా పెడా ఏపీలో వాడుకుంటోంది బీజేపీ. రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఇప్పటికి రెండు సార్లు బీజేపీ వాడేసుకుని ఇలాగే నూరు శాతం ఓట్లు వేయించుకుంది. అంతే కాదు కేలకమైన బిల్లులను గత ఎనిమిదేళ్ళుగా ఈ రెండు పార్టీల మద్దతుతో పార్లమెంట్ లో నెగ్గించుకుంది. ఏపీలో బీజేపీ ఒకందుకు హెలో అంటే ఈ రెండు పార్టీలు మరోకందుకు హెలో అని మాటలు కలుపుతున్నాయి.
బీజేపీ తమతోనే సన్నిహితంగా ఉంటుందని వైసీపీ చెప్పుకుంటే కాదు, చంద్రబాబుకు మోడీ బాగా గౌరవం ఇస్తున్నారని తమ్ముళ్ళు చెప్పుకుంటారు. ఇలా ఈ రెండు పార్టీల కమల కుతూహలం హద్దులు దాటుతోంది. ఇంతకీ ఏపీకి బీజేపీ ఏమి చేసిందని మిగిలిన విపక్షాలు మేధావులు గట్టిగా ప్రశ్నిస్తునన ఈ పార్టీలకు మాత్రం అసలు పట్టడంలేదు. మోడీతో లంచ్ చేశామని ఒకరంటే షేక్ హ్యాండ్ ఇచ్చామని మరొకరు మురిసిపోతారు.
ఇలా ఏపీలో వైసీపీ టీడీపీ బీజేపీ మద్దతు పొందడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే వారిని వాడుకుంటోంది. ఏపీలో బీజేపీకి ఈ రోజుకు కూడా పట్టు లేదు, అయినా సరే తన అడ్డాగా చేసుకుంది, ఈ రెండు పార్టీల వైఖరి వల్లనే బీజేపీకి ఇది సాధ్యపడింది. దాంతో ఏపీ వరకూ బేఫికర్ గా బీజేపీ ఉంది.
ఈ విషయం ఇలా ఉంటే తెలంగాణాలో కూడా ఈ రెండు పార్టీలను ముందు పెట్టి బీజేపీ తనదైన రాజకీయం చేస్తోంది. ఒక విధంగా చెప్పాలీ అంతే బాగా వాడేసుకుంటోంది. బీజేపీ వాడకం అక్కడ మామూలుగా లేదు అని అంటున్నారు. వైసీపీకి, టీడీపీకి తెలంగాణాలో ఓట్లు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా సెటిలర్స్ లో బలం బాగా ఉంది. సామాజికవర్గాల పరంగా, ప్రాంతాల పరంగా చూసినా ఈ రెండు పార్టీలను అభిమనించేవారు సెటిలర్స్ లో చాలా మంది ఉన్నారు.
ఒక లెక్క చూస్తే దాదాపుగా కోటి మంది దాకా సెటిలర్స్ తెలంగాణా అంతటా ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవడానికి బీజేపీ వైసీపీ టీడీపీలను గట్టిగా వాడుకుంటోంది. ఈ రెండు పార్టీలతో తమకు మంచి రిలేషన్స్ ఉన్నాయని అక్కడ చెప్పుకుంటోంది. ఏపీలో అయితే ఈ రెండు పార్టీలు బీజేపీ వెంట పడుతునాయి. దాన్ని కాస్తా మార్చి బీజేపీ అంటే ఈ రెండు పార్టీలకు బాగా ఇష్టం అన్న తీరున ప్రచారం చేసుకుంటోందిట.
ఇవన్నీ వైసీపీ, టీడీపీ పెద్దలకు తెలియవా అంటే బాగా తెలుసు. కానీ వారు ఏమీ చేయలేకపోతున్నారు. అది వారి నిస్సహాయత. ఎందుకంటే తెలంగాణాలో రాజకీయం ఈ రెండు పార్టీలకు ముఖ్యం కాదు. ఏపీలో చల్లగా ఉంటే చాలు. అందుకు బీజేపీ అండ వారికి కావాలి. ఈ రాజకీయ రహస్యం తెలిసిన బీజేపీ తెలంగాణాలో చెలరేగిపోతోంది అని అంటున్నారు. మరి సెటిలర్స్ ఓట్లు బీజేపీకి ఈ విధంగా పడతాయా. ఏమో చూడాలి మరి.