Begin typing your search above and press return to search.
బాబు పై బీజేపీ సీరియస్ అస్త్రం ... !
By: Tupaki Desk | 9 July 2018 8:11 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ‌్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టడానికి ఇప్పుడు బీజేపీ సుబ్రహ్మణ్య స్వామి అనే అస్త్రాన్ని సంధించనున్నది. 2014 లో బీజేపీతో బరిలో దిగి గెలుపును కైవసం చేసుకున్న తెలుగుదేశం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు - ప్రతిపక్షాల వత్తిడి వల్ల ప్రత్యక హోదా పాట పాడక తప్పలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన దేశ రాజధాని ఢిల్లీకి పదే - పదే వెళ్లి ప్రత్యక హోదా కోసం మంటూ ప్రజల్ని మభ్య పెట్టారు. అయితే ఆయన ఢిల్లీకి ప్రత్యక హోదా కోసం కాదు - తనపై ఉన్న కేసుల నుంచి బయటపడటానికే అని విపక్షాలు దుమెత్తిపోశాయి.
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడిని ఎదుర్కునేందుకు సుబ్రహ్మణ్య స్వామి ని ప్రవేశపెట్టనుంది. సుబ్రహ్మణ్య స్వామి మంచి ఆర్దికవేత్తే కాదు.. లిటిగెంట్ కూడా. ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. గతంలో ఆయన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను - శశికళను జైలుకు పంపడంలో సుబ్రహ్మణ్యస్వామిదే కీలక పాత్ర. అంతే కాకుండా మన్ మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బొగ్గు గునుల కుంభకోణాన్ని వెలుగులో తేవటంలో ఈయనదే కీలక పాత్ర. నేషనల్ హేరాల్డ్ కేసులో సోనియ గాంధీకి - రాహులో గాంధీ కి చుక్కలు చూపించారు.
మొదటినుంచి భారతీయ జనతా పార్టీకి అండదండలు అందించిన సుబ్రహ్మణ్య స్వామి అయితేనే చంద్రబాబు నాయుడిని నిలువరించగలడని బిజేపి ఆలోచన. ఇందుకుగాను తిరుమల తిరుపతి లో శ్రీవారి ఆభారణాల విచారణ కొరకు సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం గాను ఆయన సాక్షాలను సేఖరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండ ఓటుకు నోటు కేసును తిరిగి తెరపైకి తెచ్చి చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టాలన్నది బిజేపి ఆలోచన. అంతే కాకుండ తిరుమల తిరుపతి దేవస్దానం యొక్క సొమ్మును చంద్రబాబు మళ్ళిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదిఇలా ఉండగా చంద్రబాబును హిందు వ్యతిరేక నాయకుడిగా ప్రచారం చేసి, ఆయన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. బాబూ మాకు జాబు ఏది అని అడిగే నిరుద్యోగులు.. ఓటుకు నోటు అంటూ ప్రతిపక్షాలు, తిరుపతిలో పోయినా పరపతి. ఇన్నీ ఇక్కట్లు మధ్య బాబు ఏది నీకు దారి.