Begin typing your search above and press return to search.
కన్నడ సిత్రం: బాబుకు బ్యాడ్ టైం మొదలైనట్లేనా?
By: Tupaki Desk | 15 May 2018 8:28 AM GMTహంగ్ అంచనా తప్పైంది. అత్యధిక సీట్లు సాధిస్తుందన్న కాంగ్రెస్ బొక్క బోర్లా పడితే.. బీజేపీ దూసుకెళ్లింది. కర్ణాటకలో ఎవరి అండా అవసరం లేకుండా.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం ఆ పార్టీకి వచ్చేసింది. ఈ విజయంపై కమలనాథుల సంతోషంగా అంతా ఇంతా కాదు. నువ్వా.. నేనా? అన్నట్లుగా మారిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటం పై బీజేపీ నేతలు యమా ఖుషీగా ఉన్నారు.
పలు రాష్ట్రాల్లో విజయం సాధిస్తున్న బీజేపీకి కర్ణాటక విజయం మాత్రం సో స్పెషల్ అని చెప్పక తప్పదు. దీనికి కారణం లేకపోలేదు. బీజేపీ ఒక్కటిగా పోరాడితే.. బీజేపీ విజయం సాధించకుండా ఉండేందుకు వారి ప్రత్యర్థులు పన్నిన ఎత్తులు అన్ని ఇన్ని కావు. అవేమీ పని చేయలేదని.. తమకు కన్నడ ప్రజలు పట్టం కట్టినట్లుగా బీజేపీ నేతలు ఇప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. కర్ణాటక ఫలితం కమలనాథులకు అనుకూలంగా వెలువడిన క్షణం నుంచి అందరి చూపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పడుతోంది.
కర్ణాటక ఎన్నికలు అయ్యాక మీ సంగతి చూస్తామంటూ బీజేపీ నేతలు ఓపెన్ గానే ఏపీ సర్కారుకు వార్నింగ్ ఇచ్చేశారు. బీజేపీ నేతల వార్నింగ్ ను టీడీపీ నేతలు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. మీరు కర్ణాటకలో గెలిచినప్పుడు కదా? అన్నట్లు వారి రియాక్షన్ ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా బీజేపీ విజయం సాధించటం తెలుగు తమ్ముళ్ల గుండెల్లో గుబులుగా మారిందని చెప్పాలి.
అన్నింటికి మించి కర్ణాటక ఎన్నికల ఫలితం బాబుకు షాకింగ్ గా మారుతుందని చెప్పాలి. ప్రత్యేక హోదా అంశంపై యూటర్న్ తీసుకొని.. ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవటానికి వీలుగా పావులు కదిపిన బాబు ప్లాన్ ను కన్నడ ప్రజల తీరపు దెబ్బేయటం ఖాయమని చెబుతున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి ఖాయమని బాబు భావించారు. దీనికి తగ్గట్లే కన్నడ ప్రజల్ని బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పారు. తనకు తాను కర్ణాటకలో ప్రచారం చేయటం తప్పించి.. మిగిలిన పనుల్నీ చేశారు.
తాము అధికారంలోకి రావాలనుకున్న రాష్ట్రంలో అడ్డుగా తగులుతున్న చంద్రబాబు తీరుపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత మీ సంగతి చూస్తామన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీకి ఏం జరగబోతోంది? బాబును మోడీ ఏం చేయనున్నారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాబుకు మోడీ చుక్కలు చూపించొచ్చని చెబుతున్నారు.
నిధుల విడుదల విషయంలో మోకాలు అడ్డటంతో పాటు.. బాబును ఉక్కిరిబిక్కిరి చేసేలా.. ఆయన అవినీతికి సంబంధించిన అంశాలు కొత్తగా వెలుగు చూసేలా చేయొచ్చు. అన్నింటికి మించి బాబు వ్యతిరేకుల్ని సమీకరించటం.. పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేసే వీలుందని చెబుతున్నారు. తమ పార్టీని ఏ రీతిలో అయితే గెలవకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో.. ఏపీలోనూ టీడీపీకి అలాంటి పరిస్థితే ఎదురయ్యేలా చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి బాబుకు బ్యాడ్ టైం మొదలైందని.. దీనికి నిదర్శనమే కర్ణాటకలో బీజేపీ గెలవటంగా చెబుతున్నారు.