Begin typing your search above and press return to search.

'రేవ్ పార్టీ' లో టీడీపీ మంత్రి!..రాజు గారు వ‌ద‌ల‌ర‌బ్బా!

By:  Tupaki Desk   |   7 May 2019 1:41 PM GMT
రేవ్ పార్టీ లో టీడీపీ మంత్రి!..రాజు గారు వ‌ద‌ల‌ర‌బ్బా!
X
రేవ్ పార్టీలు... గ‌తంలో హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో హ‌ల్ చ‌ల్ చేసిన ఈ పాశ్చ‌త్య సంస్కృతి... ఇప్పుడు ఏపీకే కాదండోయ్‌... దేశ‌వ్యాప్తంగా బాగానే విస్త‌రించింది. ఏపీలో ఎన్నిక‌లకు సంబంధించి కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగిసిన వెంట‌నే... ఏపీ ఎక‌న‌మికల్ కేపిట‌ల్ విశాఖప‌ట్నం ప‌రిస‌రాల్లో జ‌రిగిన ఓ రేవ్ పార్టీ పెను క‌ల‌క‌లమే రేపింది. ఆ త‌ర్వాత త‌మిళ‌నాడు. హ‌ర్యానాల్లోనూ ఈ త‌ర‌హా పార్టీలు జ‌రిగినా... అవ‌న్నీ కేసుల‌తోనే ముగిసిపోయాయి. అయితే విశాఖ‌లో జ‌రిగిన రేవ్ పార్టీ మాత్రం క్ర‌మంగా పొలిటికల్ రంగును అద్దుకుంటోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. టీడీపీలోని ఓ కీల‌క నేత‌ - మంత్రిగా ఉన్న నేత క‌నుస‌న్న‌ల్లోనే ఈ పార్టీ జ‌రిగింద‌ని - ఈ నేప‌థ్యంలో స‌ద‌రు మంత్రిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. మొత్తంగా ఈ రేవ్ పార్టీ వ్య‌వ‌హారం స‌ద‌రు టీడీపీ మంత్రి మెడ‌కు చుట్టుకుంద‌ని, నేడో - రేపో అత‌డిపై చ‌ర్య‌లు కూడా ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ విష‌యంపై బీజేపీ సీనియ‌ర్ నేత‌ - విశాఖ ఉత్త‌ర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు... పెద్ద యుద్ధ‌మే ప్ర‌క‌టించిన‌ట్టున్నారు. హిందూత్వ భావాలు మెండుగా ఉన్న రాజు గారికి పాశ్చాత్య సంస్కృతి అంటే ప‌ర‌మ చిరాకే క‌దా. ఈ క్ర‌మంలో విశాఖ‌లో గ‌తంలో ఎన్న‌డూ లేనిది ఏకంగా రేవ్ పార్టీ జ‌రిగిపోవ‌డం - దానికి ఓ టీడీపీ మంత్రి అండ‌గా నిల‌వ‌డం రాజుగారిని తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు గురి చేసింద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో ఈ క‌థేంటో తేల్చ‌డంతో పాటుగా మ‌రోమారు విశాఖలో రేవ్ పార్టీ నిర్వ‌హించాలన్న ఆలోచ‌న వ‌స్తేనే భ‌య‌ప‌డిపోయేలా చ‌ర్య‌లుండాల‌న్న ఉద్దేశంతో రాజు గారు పెద్ద ప్లాన్ తోనే ఎంట్రీ ఇచ్చారు. ఇప్ప‌టికే విశాఖ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఈ రేవ్ పార్టీ వెనుక టీడీపీ మంత్రి హ‌స్తం ఉంద‌ని, అత‌డి ప్రోద్బ‌లంతోనే ఎక్సైజ్ శాఖ పోలీసులు ఈ పార్టీకి అనుమ‌తులు ఇచ్చేశార‌ని - సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా నేరుగా అమ‌రావ‌తి వ‌చ్చిన ఆయ‌న ప్ర‌భుత్వ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను క‌లిసి దీనిపై ఫిర్యాదు చేశారు. దేశ సంస్కృతి సంప్ర‌దాయాల‌ను మంట‌గ‌లుపుతున్న ఈ త‌ర‌హా పార్టీల‌కు అనుమ‌తులు ఎలా ఇస్తార‌ని వాదించిన రాజు గారు... ఈ పార్టీకి అనుమ‌తులు ఇచ్చేలా అదికారుల‌పై ఒత్తిడి తీసుకొచ్చిన టీడీపీ మంత్రిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా ఆయ‌న ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తాను త‌యారు చేసిన స‌మ‌గ్ర నివేదిక‌ను కూడా ఆయ‌న సీఎస్ కు అంద‌జేశారు. ఈ ఫిర్యాదుపై కాస్తంత వేగంగానే స్పందించిన సీఎస్‌... రాజు గారు చెప్పిన విష‌యాన్ని పూర్తిగానే కాకుండా సావ‌దానంగా విని.... దీనిపై విచార‌ణ‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌)ను వేసేందుకు కూడా నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే... పార్టీకి అండ‌దండ‌లు అందించిన మంత్రితో పాటు ఆ మంత్రిగారు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న టీడీపీకి కూడా పెద్ద దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.